Haryana CM : ఫోగ‌ట్ హ‌త్య‌పై గోవాకు హ‌ర్యానా సీఎం లేఖ

సీఎంను క‌లిసిన సోనాలీ కుటుంబం

Haryana CM : దేశ వ్యాప్తంగా సంచ‌లనం క‌లిగించింది హ‌ర్యానాకు చెందిన టిక్ టాక్ స్టార్, యాంక‌ర్, భార‌తీయ జ‌న‌తా పార్టీ నాయ‌కురాలు సోనాలీ ఫోగ‌ట్ కేసు. సోనాలీ ఫోగ‌ట్ త‌న స్నేహితుల‌తో క‌లిసి గోవాకు వెళ్లారు.

అక్క‌డ ప‌బ్ లో ఎంజాయ్ చేశారు. అనంత‌రం గుండె పోటుతో మృతి చెందిన‌ట్లు ప్ర‌క‌టించారు. కానీ ఆమె పూర్తి ఫిట్ నెస్ తో ఉంద‌ని, త‌మ‌కు హ‌త్య చేసిన‌ట్లు అనుమానం ఉందంటూ సోనాలీ(Sonali Phogat) కుటుంబీకులు అభ్యంత‌రం తెలిపారు.

ఈ మేర‌కు గోవా బీజేపీ ప్ర‌భుత్వం రంగంలోకి దిగింది. స్వ‌యంగా సీఎం పూర్తి విచార‌ణ చేప‌ట్టాల‌ని ఆదేశించారు. దీంతో గోవా పోలీస్ బాస్ సోనాలీ కేసు విచార‌ణ చేప‌ట్టారు.

కూల్ డ్రింక్స్ లో డ్ర‌గ్స్ క‌లిపి అత్యాచారానికి పాల్ప‌డ్డారని, ఆ త‌ర్వాత హ‌త్య చేశారంటూ తేలింది. ఈ విష‌యంలో సోనాలీ ఫోగ‌ట్ స‌హాయ‌కుడు, అత‌డి స్నేహితుడితో పాటు రెస్టారెంట్ ఓన‌ర్ , డ్ర‌గ్స్ డీల‌ర్ ను మొత్తం న‌లుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

దీనిపై సీరియ‌స్ గా స్పందించారు హ‌ర్యానా సీఎం(Haryana CM) మ‌నోహ‌ర్ లాల్ ఖ‌ట్ట‌ర్. ఈ మేర‌కు ఘ‌ట‌న అంతా గోవాలో చోటు చేసుకుంద‌ని, అందుకే సీబీఐకి విచార‌ణ‌కు ఆదేశించాల‌ని కోరుతూ సీఎం గోవా సీఎంకు లేఖ రాశారు.

పోస్ట్ మార్టం నివేదిక‌లో ఆమె శ‌రీరంపై బ‌ల‌మైన గాయాలు ఉన్న‌ట్లు గుర్తించారు. ఇదిలా ఉండ‌గా సీబీఐతో విచార‌ణ జ‌రిపిస్తే నిజాలు వెలుగు చూస్తాయ‌ని సోనాలీ ఫోగ‌ట్ కూతురు పేర్కొన్నారు.

కాగా సోనాలీ ఫోగ‌ట్ చ‌ని పోయే కంటే ముందు ఉత్త‌ర గోవా లోని అజునా బీచ్ లోని క‌ర్లీస్ రెస్టారెంట్ లో స‌హ‌చ‌రులు మ‌త్తు మందు ఇచ్చారు. ఇది సీసీ టీలో రికార్డ్ అయ్యింది.

Also Read : బిల్కిస్ దోషుల విడుద‌ల అమాన‌వీయం

Leave A Reply

Your Email Id will not be published!