Goa CM Sonali Phogat : సోనాలీ ఫోగత్ కేసు సీబీఐకి ఓకే – సీఎం
కుటుంబం కోరుకుంటే అంగీకరిస్తాం
Goa CM Sonali Phogat : ప్రముఖ టిక్ టాక్ స్టార్, యాంకర్, నటి , హర్యానాకి చెందిన భారతీయ జనతా పార్టీ నాయకురాలు సోనాలీ ఫోగటల్ దారుణ హత్యకు గురయ్యారు. ఆమె మొదట గుండె పోటుతో మృతి చెందిందని ప్రకటించారు.
కానీ కుటుంబీకులు చేసిన ఆరోపణలతో సాక్షాత్తు గోవా సీఎం ప్రమోద్ సావంత్(Goa CM) స్పందించారు. వెంటనే విచారణకు ఆదేశించారు. సోనాలీ ఫోగట్(Sonali Phogat) మృతిపై పోస్ట్ మార్టమ్ నిర్వహించారు.
శవ పరీక్షలో బలమైన గాయాలు ఉన్నట్లు తేలింది. దీంతో సోనాలీ సహాయకుడు, అతడి స్నేహితుడిని విచారించారు. తప్పు ఒప్పుకున్నారు. డ్రగ్స్ కలిపి ఆమెను మత్తులోకి దింపి ఆపై అత్యాచారానికి పాల్పడ్డారు.
దీంతో ఆ ఇద్దరితో పాటు రెస్టారెంట్ (పబ్ ) ఓనర్ తో పాటు డ్రగ్స్ డీలర్ ను అదుపులోకి తీసుకున్నారు. దీనిపై కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐతో విచారణ జరిపించాలని హర్యానా సీఎం మనోహర్ లాల్ ఠక్కర్ ను కలిశారు సోనాలీ భగత్ కుటుంబీకులు.
కేసును దర్యాప్తు సంస్థకు బదిలీ చేయాలని ఫోన్ చేశారు గోవా సీఎం ప్రమోద్ సావంత్. ఈ సందర్భంగా సీఎం స్పందించారు. మీడియాతో ఆదివారం మాట్లాడారు.
హర్యానా సీఎం నాతో ఫోన్ లో మాట్లాడారు. ఈ కేసుపై సమగ్ర దర్యాప్తు చేయాలని కోరారు. కుటుంబ సభ్యులు తనను వ్యక్తిగతంగా కలుసుకుని కోరిన తర్వాత కేసును సీబీఐ స్వాధీనం చేసుకోవాలని చెప్పారన్నారు.
నాకు దానితో సమస్య లేదు. ఇవాళ అన్ని ఫార్మాలిటీస్ తర్వాత అవసరమైతే ఈ కేసును సీబీఐకి అప్పగిస్తామని స్పష్టం చేశారు సీఎం.
Also Read : కళ్ల ముందే టవర్లను కూల్చేశారు