Rishi Sunak : యుఎస్ పై రిషి సునక్ షాకింగ్ కామెంట్స్
ఆ సూచనే తన ఓటమికి దారి తీయొచ్చు
Rishi Sunak : ప్రవాస భారతీయుడైన రిషి సునక్ ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారారు. యావత్ ప్రపంచం ప్రస్తుతం యుకె (యునైటెడ్ కింగ్ డమ్ ) ప్రధాని ఎన్నికైనే ఉంది.
ఇప్పటి వరకు నాలుగు రౌండ్లలో ఎన్నికలు జరిగాయి. ఆ నాలుగింట్లోనూ కన్జర్వేటివ్ పార్టీకి చెందిన రిషి సునక్ ఆధిక్యంలో వచ్చారు. ప్రస్తుతం విదేశాంగ శాఖ మంత్రిగా ఉన్న లిజ్ ట్రస్ టాప్ లోకి ఉన్నట్టుండి వచ్చారు.
పోల్ సర్వేలో రిషి సునక్ వెనుకబడడం అందరినీ విస్తు పోయేలా చేసింది. ఇటీవలి వరకు ప్రధాన మంత్రిగా ఉన్న బోరిస్ జాన్సన్ తను దిగిపోయేందుకు రిషి సునక్ కారణమని గుర్రుగా ఉన్నారు.
స్కాం కేసులో తనంతకు తానుగా పదవి నుంచి తప్పు కోవాల్సి వచ్చింది. ఇదే సమయంలో ఆయన బేషరతుగా లిజ్ ట్రస్ కు మద్దతు తెలియ చేస్తున్నారు. మరో వైపు రిషి సునక్ ఓడి పోవాలని కోరుకుంటున్నారు.
ఎవరూ ఊహించని రీతిలో లిజ్ ట్రస్ ముందంజలో కొనసాగుతున్నారు. ఇదిలా ఉండగా ఆదివారం రిషి సునక్(Rishi Sunak) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు రిషి సునక్. యుఎస్ సూచన ఓటమికి దారి తీయవచ్చంటూ అభిప్రాయం వ్యక్తం చేశారు.
10 నిమిషాల కంటే తక్కువ వ్యవధిలో మూడోసారి కాలిఫోర్నియా గురించి ప్రస్తావించినప్పుడు సరైన మార్గంలో జరగడం లేదని భావించారంటూ పేర్కొన్నారు రిషి సునక్.
ఈ విషయం గురించి ప్రముఖ పత్రిక ది డైలీ ప్రస్తావించింది. ఇదిలా ఉండగా సునక్ ఎవరో కాదు. పంజాబీ మూలాలు కలిగిన వ్యాపారవేత్త. ఆయన ప్రముఖ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ చైర్మన్ నారాయణ మూర్తికి స్వయాన అల్లుడు.
Also Read : వాటికన్ లో కార్డినల్ గా హైదరాబాద్ బిషప్