Veer Savarkar : 8వ తరగతి పాఠంలో సావర్కర్ ప్రస్తావన
ప్రవేశ పెట్టిన బీజేపీ కర్ణాటక ప్రభుత్వం
Veer Savarkar : కన్నడ నాట కొలువు తీరిన భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలోని బొమ్మై ప్రభుత్వం రోజు రోజుకు వివాదాలకు కేరాఫ్ గా నిలిచింది. కేంద్రంలో 2014లో ఏర్పాటైన మోదీ ప్రభుత్వం వచ్చాక పెద్ద ఎత్తున బీజేపీ భావ జాలాన్ని రుద్దే ప్రయత్నం చేస్తోంది.
ఇప్పటికే ఒకే దేశం , ఒకే భాష, ఒకే మతం, ఒకే జాతి, ఒకే పార్టీ, ఒకే రాజ్యాంగం ఉండాలన్నది బీజేపీ సిద్దాంతం. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ వ్యవస్థాపకులలో ఒకరైన దామోదర్ సావర్కర్ ను ఇప్పుడు తలకెత్తుకుంది.
తాజాగా మరో వివాదానికి తెర తీసింది కర్ణాటక ప్రభుత్వం. దీనిపై తీవ్ర విమర్శలు తలెత్తాయి. వీర సావర్కర్(Veer Savarkar) గురించి కర్ణాటక రాష్ట్రంలోని 8వ తరగతి విద్యార్థుల కోసం పుస్తకంలో పాఠ్య ప్రణాళికలో చేర్చారు.
ఆ పాఠ్య పుస్తకం ప్రకారం వీర సావర్కర్ అండమాన్ జైలులో ఉన్న సమయంలో స్వదేశాన్ని సందర్శించేందుకు పక్షి రెక్కలపై కూర్చుని ఎగురుతూ ఉండేవాడు.
అలా ఆయన పక్షులపై జైలు నుండి బయటకు వెళ్లాడు. బుల్బుల్ పక్షులు గదిని సందర్శించేవి. సావర్కర్ రెక్కలపై కూర్చుని బయటకు ఎగిరి పోయేవారంటూ పేర్కొంది.
రాష్ట్రంలోని సవరించిన హైస్కూల్ పాఠ్యాంశాల్లో వినాయక్ దామోదర్ సావర్కార్ పై పాఠ్య పుస్తకాల రివిజన్ కమిటీ ఒక విభాగాన్ని చేర్చడాన్ని తీవ్రంగా తప్పు పట్టాయి విపక్షాలు.
ఇలాంటివేనా చరిత్రను తిరగ రాస్తుందని పదే పదే మోదీ చెబుతున్నది అంటూ మండిపడ్డాయి. సావర్కర్ సైద్దాంతిక గురువుగా పేరొందారు. ప్రస్తుతం ఇది హాట్ టాపిక్ గా మారింది కన్నడ నాట.
Also Read : పోషకాహార లోపంపై యుద్దం చేయాలి – మోదీ