Akhilesh Yadav : తొక్కిసలాటకు సీఎం యోగినే కారణం
నిప్పులు చెరిగిన అఖిలేష్ యాదవ్
Akhilesh Yadav : సమాజ్ వాది పార్టీ చీఫ్, మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. యూపీలోని బృందావన్ ఆలయంలో చోటు చేసుకున్న తొక్కిసలాటకు ప్రధాన కారణం సీఎం యోగి ఆదిత్యానాథ్(CM Yogi) అంటూ ఆరోపించారు.
మథురలో అఖిలేష్ యాదవ్ మీడియాతో మాట్లాడారు. తాము అధికారంలో ఉన్న సమయంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురు కాలేదన్నారు.
కానీ లాండ్ అండ్ ఆర్డర్ ను మెయింటెనెన్స్ చేయడంలో, పాలనను కంట్రోల్ చేయడంలో సీఎం పూర్తిగా ఫెయిల్ అయ్యారంటూ ధ్వజమెత్తారు.
ప్రతి ఏటా జన్మాష్టమిని ఘనంగా జరుపుకునే వారని, కానీ ఈసారి మాత్రం లక్షలాదిగా తరలి వచ్చిన భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని వాపోయారు.
ఎప్పుడూ ఇలాంటి ఘటనలు ఎదురు కాలేదన్నారు అఖిలేష్ యాదవ్(Akhilesh Yadav). బాంకీ బీహారీ ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో ఇద్దరు భక్తులు మృతి చెందారు. ఏడుగురు గాయపడ్డారు.
ఆగస్టు 20న జన్మాష్టమి రోజున మథురను సందర్శించిన సీఎం ఈ మొత్తం ఘటనకు కారకుడయ్యాడని ధ్వజమెత్తారు అఖిలేష్ యాదవ్. ఈ మొత్తం విషాదానికి బీజేపీ, యోగి ఆదిత్యానాథ్ బాధ్యత వహించాలని స్పష్టం చేశారు.
భక్తులు పెద్ద సంఖ్యలో వస్తారని తెలుసు. ఆ సమయంలో సీఎం అక్కడికి ఎందుకు వెళ్లాల్సి వచ్చిందని ప్రశ్నించారు. భక్తులను నియంత్రించాల్సిన పోలీసులు ఆయన కోసం సెక్యూరిటీ కల్పించాల్సి వచ్చింది.
దీంతో ఈ ఘటన చోటు చేసుకుందన్నారు అఖిలేష్ యాదవ్. ఈ ఘటనలో మరణించిన కుటుంబ సభ్యులకు నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఒక్కో కుటుంబానికి రూ. 50 లక్షలు ఇవ్వాలని కోరారు అఖిలేష్ యాదవ్.
Also Read : బల నిరూపణకు అరవింద్ కేజ్రీవాల్ రెడీ