Arvind Kejriwal : మోదీకి బుద్ది చెప్పేందుకే విశ్వాస తీర్మానం

బ‌లాన్ని నిరూపించు కునేందుకే కీల‌క స‌మావేశం

Arvind Kejriwal : ఇవాళ దేశ వ్యాప్తంగా ఢిల్లీలో ఏం జ‌రుగుతుందోన‌న్న ఉత్కంఠ నెల‌కొంది. విశ్వాస తీర్మానం ఎందుకు ప్ర‌వేశ పెట్టాల్సి వ‌చ్చింద‌నే దానిపై క్లారిటీ ఇచ్చే ప్ర‌య‌త్నం చేశారు ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్‌, ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్.

ఆప్ లోట‌స్ ని ద్ర‌వ్యోల్బ‌ణానికి లింక్ చేయ‌డం విశేషం. అసెంబ్లీ స‌మావేశాల్లో కీల‌క అజెండాల్లో విశ్వాస తీర్మానం ఒక‌టి. భార‌తీయ జ‌న‌తా పార్టీ ప్ర‌జా సంక్షేమంపై ఫోక‌స్ సారించే బ‌దులు త‌న బిలియ‌నీర్ స్నేహితుల‌కు స‌హాయం చేస్తోందని ఆరోపించారు.

అర‌వింద్ కేజ్రీవాల్ సోమ‌వారం కేంద్ర ప్ర‌భుత్వంపై మొత్తంగా దాడిని ముమ్మ‌రం చేశారు. న‌రేంద్ర మోదీ(PM Modi) నేతృత్వంలోని బీజేపీ సంకీర్ణ ప్ర‌భుత్వం ఎనిమిదేళ్ల కాలంలో ఎనిమిది బీజేపీయేత‌ర ప్ర‌భుత్వాల‌ను కూల్చి వేశారంటూ ఆరోపించారు.

కేంద్రం ప‌త‌నానికి ప్లాన్ వేసిన ప్ర‌తిసారీ ఇంధ‌న ధ‌ర‌లు పెరుగుతాయి. క‌ర్ణాట‌క‌, మ‌ధ్య‌ప్ర‌దేశ్ ల‌లో ప్ర‌భుత్వాలు కుప్ప కూలాయి. దీనికి ప్ర‌ధాన కార‌ణం మోదీ త్ర‌యం.

ఇప్పుడు జార్ఖండ్ లో కూడా జ‌ర‌గ‌వ‌చ్చ‌ని హెచ్చ‌రించారు అర‌వింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal). ఇదిలా ఉండ‌గా సీఎం హేమంత్ సోరేన్ ఎమ్మెల్యే అన‌ర్హ‌త వేటుకు గుర‌య్యారు.

దేశంలో ఆప‌రేష‌న్ క‌మ‌లం విఫ‌ల‌మైంద‌ని ధ్వ‌జ‌మెత్తారు ఆప్ చీఫ్‌. ఎమ్మెల్యేల‌ను కొనుగోలు చేసేందుకు రూ. 800 కోట్లు ఖ‌ర్చు చేశార‌ని షాకింగ్ కామెంట్స్ చేశారు.

ఆప‌రేష‌న్ లోట‌స్ అనేది ప్ర‌తిప‌క్ష పార్టీలు త‌రచుగా ఉప‌యోగించే ప‌దం. కాగా బీజేపీ ఎన్నికైన ప్ర‌భుత్వాల‌ను ల‌క్ష్యంగా చేసుకుంటుంద‌న్న ఆరోప‌ణ‌లున్నాయి.

విశ్వాస తీర్మానం ఎందుకు అవ‌స‌ర‌మ‌ని న‌న్ను అడుగుతున్నారు. మోదీకి బుద్ది చెప్పేందుకే ఇలా చేశామ‌న్నారు ఆప్ చీఫ్‌.

Also Read : ఎన్వీ ర‌మ‌ణ‌పై ఒమ‌ర్ అబ్దుల్లా ఫైర్

Leave A Reply

Your Email Id will not be published!