Ghulam Nabi Azad : వ్యక్తిగత దూషణలు వద్దని చెప్పా – ఆజాద్
రాహుల్ గాంధీ వినిపించు కోలేదు
Ghulam Nabi Azad : కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పిన కేంద్ర మాజీ మంత్రి గులాం నబీ ఆజాద్ (Ghulam Nabi Azad)తన మాటల తూటాలు పేల్చుతూనే ఉన్నారు. ఆయన ప్రధానంగా రాహుల్ గాంధీని టార్గెట్ చేశారు.
ప్రత్యర్థులపై వ్యక్తిగత ఆరోపణలు చేయవద్దని తాను రాహుల్ కు సూచించానని కానీ ఆయన వినిపించు కోలేదని షాకింగ్ కామెంట్స్ చేశారు. తన లాంటి రాజకీయ నాయకులకు ఇది రుచించదన్నారు.
తాము కింది స్థాయి నుంచి పార్టీలో అంచెలంచెలుగా ఎదిగామని, పార్టీని ఎలా బిల్డ్ చేయాలో తమకు తెలుసన్నారు. ఇదే క్రమంలో కాంగ్రెస్ కు గాంధీ చేసిన సేవలు గొప్పవేనని పేర్కొన్నారు.
ఇదే క్రమంలో పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకులతో వ్యక్తిగతంగా మాట్లాడాలంటూ తాను రాహుల్ గాంధీకి సూచించానని కానీ పట్టించు కోలేదంటూ ఫైర్ అయ్యారు.
2019లో నరేంద్ర మోదీని ఉద్దేశించి చౌకీదార్ చోర్ హై అన్న నినాదం పార్టీకి తీరని నష్టం చేకూర్చేలా చేసిందన్నారు గులాం నబీ ఆజాద్.
ఇదిలా ఉండగా పార్టీలోని సీనియర్ల కారణంగా తాను పని చేయలేక పోతున్నాననంటూ రాహుల్ గాంధీ బహిరంగంగా చెప్పడాన్ని తీవ్రంగా తప్పు పట్టారు.
ఇందిరా గాంధీ హయాంలో రాజకీయ పాఠాలు నేర్చుకున్నామని అన్నారు. ఆజాద్ జాతీయ మీడియాతో మాట్లాడారు. ఆనాడు అటల్ బిహారి వాజ్ పేయి తో కలిసి మాట్లాడాలని ఇందిరాజీ చెప్పారు.
ఇది పరిణతి చెందిన నాయకత్వం అంటే అని స్పష్టం చేశారు. తాను ఏదీ కూడా నేర్చుకునే స్థితిలో రాహుల్ గాంధీ ప్రస్తుతం లేడన్నారు ఆజాద్(Ghulam Nabi Azad).
Also Read : బీజేపీయేతర పార్టీల ఏకంపై ఫోకస్