India Latin America : భార‌త్ తో బంధానికి విదేశాలు ఆస‌క్తి

లాటిన్ అమెరికా..ఆఫ్రికా ఉత్సుక‌త

India Latin America :  రోజు రోజుకు త‌న విదేశాంగ విధానంతో మ‌రింత దూసుకు పోతోంది భార‌త్. విదేశాంగ శాఖ మంత్రి సుబ్ర‌హ్మ‌ణ్యం జై శంక‌ర్ సారథ్యంలో ప‌టిష్ట‌మైన బంధాల‌ను పెంపొందించుకునేలా ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు.

గ‌త వారంలో ఆయ‌న బ్రెజిల్, అర్జెంటీనా, ప‌రాగ్వేల‌లో ప‌ర్య‌టించారు. ఆ టూర్ స‌క్సెస్ అయ్యింది. న‌రేంద్ర మోదీ ప్ర‌భుత్వం లాటిన్ అమెరికాతో బంధాన్ని కొన‌సాగించ‌నుంది.

ఈ దేశాలు భార‌త దేశంతో ద్వైపాక్షిక స‌హకారం మ‌రింగా పెంచు కోవాల‌ని అనుకుంటున్నాయి. 2013లో యుపీఏకు చెందిన స‌ల్మాన్ ఖుర్షిద్ ఈ దేశాల‌లో ప‌ర్య‌టించారు.

ఆ త‌ర్వాత ఇప్పుడు అంటే 9 సంవ‌త్స‌రాల త‌ర్వాత జై శంక‌ర్ సందర్శించారు. లాటిన్ అమెరికాను(India Latin America) సంద‌ర్శించిన మొద‌టి భార‌తీయ విదేశాంగ మంత్రి కావ‌డం విశేషం.

జై శంక‌ర్ కు బ్రెజిలియ‌న్ , అర్జెంటీనా , ప‌రాగ్వే స‌హ‌చ‌రులు రెడ్ కార్పెట్ ప‌రిచార‌ని స‌మాచారం. మూడు దేశాల అధినేత‌లు భార‌త విదేశాంగ మంత్రిని క‌లిసేందుకు స‌మ‌యాన్ని వెచ్చించారు.

ఉక్రెయిన్ , ఇండో ప‌సిఫిక్ , తూర్పు ల‌డ‌ఖ్ లో భార‌త సైన్యం పీఎల్ఏకి అండ‌గా నిలుస్తున్న తీరును మూడు దేశాల నాయ‌క‌త్వం ప్ర‌శంసించింది.

క‌రోనా వైర‌స్ ప్ర‌పంచాన్ని విస్తు పోయేలా చేసిన స‌మ‌యంలో భార‌త దేశం త‌యారు చేసిన వ్యాక్సిన్లు చాలా దేశాల‌కు వ‌ర ప్ర‌దాయనిగా మారాయ‌ని కితాబు ఇచ్చారు.

ప్ర‌త్యేకించి ఈ దేశాల చీఫ్ లు ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ నాయ‌క‌త్వాన్ని ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించ‌డం విశేషం. జ‌న‌వ‌రి 2023 చివ‌రి దాకా యుఎన్ఎస్సీ స‌భ్యుడిగా ఉంటూనే ఈ ఏడాది చివ‌ర‌లో జీ20 అధ్య‌క్ష బాధ్య‌త‌లు స్వీక‌రించింది భార‌త్.

Also Read : ప్ర‌పంచ కుబేరుల్లో అదానీకి మూడో స్థానం

Leave A Reply

Your Email Id will not be published!