Manish Sisodia Locker : సిసోడియా బ్యాంక్ లాకర్ సీబీఐ సోదా
వాస్తవమేనని స్పష్టం చేసిన డిప్యూటీ సీఎం
Manish Sisodia Locker : ఢిల్లీ ప్రభుత్వం తీసుకు వచ్చిన మద్యం పాలసీ లో కుంభకోణం చోటు చేసుకుందంటూ ఇప్పటికే డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాతో పాటు మరో 14 మంది ఉన్నతాధికారులపై కేసు నమోదు చేసింది సీబీఐ.
ఇందులో భాగంగా సిసోడియోకు చెందిన బ్యాంక్ లాకర్(Manish Sisodia Locker) ను ఇవాళ సోదా చేపట్టింది. ఈ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ భారీ అవినీతి, అక్రమాలకు పాల్పడిందంటూ భారతీయ జనతా పార్టీ ఆరోపించింది.
అయితే ఆప్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కేంద్రం నాటకాలు ఆడుతోందంటూ ఆప్ సంచలన ఆరోపణలు చేసింది. ఒక్కో ఎమ్మెల్యేకు రూ. 20 కోట్లు, చేర్పించే వారికి రూ. 25 కోట్ల చొప్పున ఆఫర్ చేసిందంటూ వ్యాఖ్యానించారు ఆప్ ఎంపీ సంజయ్ సింగ్(MP Sanjay Singh).
ఇదే విషయాన్ని అసెంబ్లీ సాక్షిగా ఆప్ చీఫ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal) ప్రస్తావించారు ప్రత్యేకంగా. తమ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కేంద్రంలోని మోదీ, బీజేపీ ప్రభుత్వం ఏకంగా రూ. 800 కోట్లు ఖర్చు చేస్తోందంటూ ధ్వజమెత్తారు.
ఇదే సమయంలో దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు మోదీ(PM Modi) సర్కార్ ఏకంగా 277 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేసిందని మండిపడ్డారు. పీఎం బీజేపీ ఎనిమిదేళ్ల పాలనలో ఎనిమిది ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికైన ప్రభుత్వాలను కూల్చి వేశారంటూ ఆరోపించారు.
ఇందులో భాగంగానే ఎలాంటి ఆధారాలు లేకుండానే ఆరోపణలు చేస్తూ సిసోడియాపై అక్రమ కేసులు బనాయించారంటూ ధ్వజమెత్తారు.
ఈ తరుణంలోనే 14 గంటల పాటు ఆయన ఇంట్లో సోదాలు చేపట్టింది. మొబైల్ ఫోన్ , ల్యాప్ టాప్ , కంప్యూటర్లను సీజ్ చేసింది.
Also Read : అభిషేక్ బెనర్జీకి ఈడీ సమన్లు జారీ