Mahua Moitra : మోదీ పాలనలో పెరిగిన ఆత్మహత్యలు
ఇదేనా బీజేపీ ఆత్మ నిర్భర్ భారత్ అంటే
Mahua Moitra : టీఎంసీ ఎంపీ మహూవా మోయిత్రా కేంద్ర సర్కార్ పై నిప్పులు చెరిగారు. నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో వెల్లడించిన దిగ్భ్రాంతికరమైన వాస్తవాలను ఆమె ముందుంచారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ(PM Modi) పదే పదే ఆత్మ నిర్బర్ భారత్ అంటున్నారని కానీ రోజు రోజుకు పెరుగుతున్న నేరాలు, ఘోరాలు, వేతన జీవుల సూసైడ్స్ గురించి ఎందుకు ప్రస్తావించడం లేదంటూ ప్రశ్నించారు.
తాజా సమాచారం మేరకు 2021లో సూసైడ్ మరణాల సంఖ్య రికార్డు స్థాయిలో పెరగడం దారుణమని వాపోయారు ఎంపీ. అసలు దేశం ఎటు పోతోందో తెలియడం లేదన్నారు. భారీ ఎత్తున ఆత్మహత్యలు పెరగడం తీవ్ర ఆందోళన కలిగిస్తోందన్నారు.
ప్రతి మిలియన్ కు 120 మరణాలు చోటు చేసుకున్నాయని తెలిపారు. గత ఏడాదితో పోలీస్తే 6.1 శాతం ఎక్కువగా ఉందని పేర్కొన్నారు మహూవా మోయిత్రా(Mahua Moitra).
గత రెండు సంవత్సరాలుగా ఆదాయ వర్గాల్లోని అనేక కుటుంబాలు ఆర్థిక దుస్థితిలో కూరుకు పోయాయని వాపోయారు ఎంపీ. నివేదిక లోని అత్యంత ఆందోళనకర అంశం ఏమిటంటే స్వయం ఉపాధి, రోజూ వారీ వేతనాలు పొందే వారిలోనే ఎక్కువగా సూసైడ్ లు చోటు చేసుకుంటుండడాన్ని ఆమె ప్రత్యేకంగా ప్రస్తావించారు.
వ్యవసాయ రంగంలో , వ్యవసాయ కూలీలలో ఆత్మహత్యల మరణాలు పెరిగాయని తెలిపారు. ఇది ప్రతి ఏటా పెరుగుతూ రావడాన్ని తీవ్రంగా తప్పు పట్టారు.
ఈ నివేదికను ప్రత్యేకంగా ప్రస్తావించారు ఎంపీ. 2021లో ఆత్మహత్యలు చేసుకున్న మొత్తం బాధితుల్లో రోజూ వారీ వేతన జీవులు 25.6 శాతం ఉండడం బాధాకరమని పేర్కొన్నారు.
Also Read : సిసోడియా బ్యాంక్ లాకర్ సీబీఐ సోదా