Abhijit Sen : ఆర్థిక‌వేత్త అభిజిత సేన్ ఇక లేరు

గుండె పోటుతో ఆక‌స్మిక మృతి

Abhijit Sen : ప్ర‌ముఖ వ్య‌వ‌సాయ ఆర్థిక వేత్త , ప్లానింగ్ క‌మిష‌న్ మాజీ మెంబ‌ర్ అభిజిత్ సేన్ ఇక లేరు. ఆయ‌న గుండె పోటుతో క‌న్ను మూశారు. తీవ్ర ఇబ్బంది ప‌డుతున్న ఆయ‌న‌ను చికిత్స నిమిత్తం ఆస్ప‌త్రికి త‌ర‌లించినా ఫ‌లితం లేక పోయింద‌ని కుటుంబీకులు తెలిపారు.

అభిజిత్ సేన్ (Abhijit Sen) మ‌ర‌ణంతో దేశంలోని వివిధ రంగాల‌కు చెందిన ప్ర‌ముఖులు తీవ్ర సంతాపం వ్య‌క్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ హ‌యాంలో డాక్ట‌ర్ మ‌న్మోహ‌న్ సింగ్ పీఎంగా ఉన్న కాలంలో 2004 నుంచి 2014 దాకా దేశానికి దిశా నిర్దేశం చేసే ప్ర‌ణాళిక సంఘంలో స‌భ్యుడిగా ప‌ని చేశారు.

అంతే కాదు బీజేపీకి చెందిన అట‌ల్ బిహారి వాజ్ పేయి ప్ర‌భుత్వం వ్య‌వ‌సాయ ఖ‌ర్చులు, ధ‌ర‌ల క‌మిష‌న్ చైర్మ‌న్ గా ఉన్నారు. ఆయ‌న ఎన్నో పుస్త‌కాలు రాశారు. మ‌రెన్నో ప‌రిశోధ‌న ప‌త్రాలు స‌మ‌ర్పించారు.

ప్ర‌తిష్టాత్మ‌క‌మైన కేంబ్రిడ్జ్ యూనివ‌ర్శిటీలో ఆర్థిక శాస్త్రంలో పీహెచ్ డి చేశారు. దేశంలోనే పేరొందిన జ‌వ‌హ‌ర్ లాల్ నెహ్రూ యూనివ‌ర్శిటీలో ఆర్థిక శాస్త్రం అధ్యాప‌కుడిగా ఉన్నారు.

అంత‌కంటే ముందు ప్ర‌పంచంలోని టాప్ యూనివ‌ర్శిటీలుగా పేరొందిన ఆక్స్ ఫ‌ర్డ్ , కేంబ్రిడ్జ్ , ఎసెక్స్ ల‌లో ఆర్థిక శాస్త్రంపై బోధించారు. ఎన్నో ఉన్న‌త ప‌ద‌వులు చేప‌ట్టారు.

అభిజిత్ సేన్ ప్ర‌ధానంగా ఆర్థిక రంగ నిపుణుడిగా, శాస్త్ర‌వేత్త‌గా, బోధ‌కుడిగా, ర‌చ‌యిత‌గా ఇలా ప‌లు రంగాల‌లో కీల‌క పాత్ర పోషించారు.

ప్ర‌స్తుతం అభిజిత్ సేన్ భార్య జ‌య‌తి ఘోష్ ప్ర‌ముఖ ప‌త్రిక ది వైర్ కు డిప్యూటీ ఎడిట‌ర్ గా ఉన్నారు. ప్ర‌పంచ ఆర్థిక రంగానికి తీర‌ని లోటు. ఆయ‌న చేసిన సూచ‌న‌లు, వెలిబుచ్చిన అభిప్రాయాలు నేటికీ విలువైన‌విగా ఉన్నాయి.

Also Read : మోదీ పాల‌న‌లో పెరిగిన ఆత్మ‌హ‌త్య‌లు

Leave A Reply

Your Email Id will not be published!