Several Leaders Resign : ఆజాద్ కు మద్దతుగా పలువురు గుడ్ బై
మాజీ జమ్మూ కాశ్మీర్ డిప్యూటీ సీఎం కూడా
Several Leaders Resign : కాంగ్రెస్ పార్టీకి కోలుకోలేని షాక్ తగిలింది. ఇప్పటికే రాజీనామా చేసిన ట్రబుల్ షూటర్ మాజీ కేంద్ర మంత్రి, మాజీ సీఎం గులాం నబీ ఆజాద్ కు మద్దతుగా జమ్మూ కాశ్మీర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన 50 మంది మంగళవారం పార్టీకి గుడ్ బై చెప్పారు.
రాజీనామా చేసిన వారిలో జమ్మూ కాశ్మీర్ మాజీ డిప్యూటీ సీఎం కూడా ఉన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ తరుణంలో పార్టీకి కోలుకోలేని దెబ్బగా భావించవచ్చు.
మాజీ డిప్యూటీ సీఎం తారా చంద్ తో పాటు పార్టీకి చెందిన సీనియర్ నాయకులు (Several Leaders Resign) తాము పార్టీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ చీఫ్ సోనియా గాంధీని కలిసి తమ రాజీనామా లేఖలను ఇచ్చినట్లు వారు తెలిపారు.
తాము ఆజాద్ కు మద్దతుగా వైదొలుగుతున్నట్లు పేర్కొన్నారు. తారా చంద్ తో పాటు మాజీ మంత్రులు అబ్దుల్ మజీద్ వానీ, మనోహర్ లాల్ శర్మ, ఘరు రామ్ , మాజీ ఎమ్మెల్యే బల్వాన్ సింగ్ తో సహా పలువురు ప్రాథమిక సభ్యత్వంతో సహా పార్టీకి రాజీనామా చేసినట్లు వెల్లడించారు.
ఇదిలా ఉండగా తాను ఎందుకు రాజీనామా చేస్తున్నాననే విషయాన్ని ప్రకటించారు గులాం నబీ ఆజాద్. ఆయన రాహుల్ గాంధీని(Rahul Gandhi) టార్గెట్ చేశారు.
ఆయన వల్లనే పార్టీ నాశనమైందని, సంప్రదింపులు , చర్చలకు ఆస్కారం లేకుండా చేశారంటూ ధ్వజమెత్తారు. తనకు పార్టీ బాధ్యతలు అప్పగించిన సమయంలో ఎనిమిది రాష్ట్రాలకు బాధ్యుడిగా ఉన్నానని తెలిపారు.
Also Read : కాంగ్రెస్ పార్టీ పనై పోయింది – జేపీ నడ్డా