Private Liquor Shops : తాగేటోళ్లకు ఆప్ సర్కార్ ఖుష్ కబర్
కొత్తగా రానున్న 300 మంద్యం దుకాణాలు
Private Liquor Shops : ఢిల్లీలోని ఎక్సైజ్ పాలసీ మరోసారి చర్చకు వచ్చింది. ఈ తరుణంలో ఆరోపణలు, మాటల తూటాలు కొనసాగుతూనే ఉన్నాయి ఆప్ , భారతీయ జనతా పార్టీ మధ్య.
ఇదే సమయంలో మద్యం పాలసీ కుంభకోణంలో డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాతో పాటు 14 మంది ఉన్నతాధికారులపై కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ అభియోగాలు మోపింది.
ఈ తరుణంలో ఢిల్లీలోని ప్రైవేట్ మద్యం దుకాణాలను (Private Liquor Shops)గురువారం నుండి ఆప్ సర్కార్ భర్తీ చేయనుంది. ప్రస్తుతం ఉప సంహరించుకున్న ఎక్సైజ్ పాలసీ 2021-22 ప్రకారం లైసెన్స్ పొందిన 250 ప్రైవేట్ మద్యం విక్రయాలు ప్రస్తుతం నగరంలో నడుస్తున్నాయి.
ఇదిలా ఉండగా సెప్టెంబరు మొదటి వారం నుంచి మరిన్ని షాపులు తెరవడం వల్ల మద్యం సరఫరా మెరుగు పడుతుందని భావిస్తోంది ఢిల్లీ ఎక్సైజ్ శాఖ. ప్రస్తుతం 250 ప్రైవేట్ షాప్స్ ఉన్నాయి.
వాటి స్థానంలో 300కి పైగా ప్రభుత్వ విక్రయాలు ఉంటాయి. అందు వల్ల అదనంగా మరిన్ని దుకాణాలు అందుబాటులోకి రానున్నాయి. ఢిల్లీ ప్రభుత్వ సంస్థల ద్వారా 500 దుకాణాలను తెరవాలని యోచిస్తోంది సర్కార్.
రాబోయే రోజుల్లో ఈ సంఖ్య మరింత పెరుగుతుందని భావిస్తోంది ఎక్సైజ్ శాఖ. మరో వైపు మద్యం ప్రియులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండేలా సదరు శాఖ మొబైల్ యాప్ ను కూడా డెవలప్ చేసింది.
సెప్టెంబర్ నుండి వినియోగదారులకు వారి పరిసరాల్లో మద్యం దుకాణాలు, షాపు సమయాల గురించి కూడా సమాచారం తెలుసు కోవచ్చని స్పష్టం చేసింది. ప్రభుత్వ విక్రయ కేంద్రాలు మాల్స్ , మెట్రో స్టేషన్ల సమీపంలో ఉంటాయి.
Also Read : ఎన్నికలు స్వేచ్ఛగా జరగాలి – మనీష్ తివారీ