PM Modi Shehbaz : మోదీ మౌనం షెహబాజ్ రాద్ధాంతం
కాశ్మీర్ పై మరోసారి నోరు జారిన పీఎం
PM Modi Shehbaz : పాకిస్తాన్ దేశ మాజీ ప్రధాన మంత్రి , మాజీ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ ఓ వైపు భారత విదేశాంగ విధానం అద్భుతంగా ఉందంటూ కితాబు ఇచ్చాడు. మరో వైపు పాకిస్తాన్ ఆర్థిక, ఆహార సంక్షోభం ఎదుర్కొంటోంది.
ఈ తరుణంలో ఇమ్రాన్ సర్కార్ ను కూలదోసి కొలువు తీరిన షెహబాజ్ షరీఫ్ కు భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ(PM Modi Shehbaz) మర్యాద పూర్వకంగా అభినందనలు తెలిపారు.
కానీ పాకిస్తాన్ పీఎం షరీఫ్ మాత్రం తన బుద్ది వంకర బుద్ది అని నిరూపించుకున్నారు. ఆయన థ్యాంక్స్ చెబుతూనే కాశ్మీర్ అంశాన్ని లేవనెత్తారు. అంతర్జాతీయ న్యాయ సూత్రాల ఆధారంగా పరిష్కరించు కోవాలని సూచించారు.
దీనిపై ఇంకా స్పందించ లేదు మోదీ. మన ప్రధాని సామాన్యంగా నోరు విప్పరు. ఆయన ఏదైనా చేయాలని అనుకుంటే వెంటనే ప్రీ ప్లాన్ గా చేసేస్తారు.
ఇంకొకరి సలహాలు సూచనలు తీసుకునే తత్వం కాదు. వేచి చూసే ధోరణి అంతకన్నా కాదు. అవసరమైతే యుద్దానికి కూడా సై అనే రకం.
ఇప్పుడున్న పరిస్థితుల్లో శ్రీలంకతో పాటు పాకిస్తాన్ సైతం తీవ్ర ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోంది. తన బేలతనాన్ని కప్పి పుచ్చుకునేందుకు మరోసారి కాశ్మీర్ అంశాన్ని ప్రస్తావించారు పాక్ పీఎం.
ఇదిలా ఉండగా పాకిస్తాన్ లో వరదల కారణంగా సంభవించిన విధ్వంసంపై తీవ్ర సానుభూతి తెలిపారు మోదీ. ఈ వరదల్లో 1,000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.
భారత దేశం అవసరమైన సాయం చేసేందుకు సిద్దంగా ఉందని ప్రకటించారు పీఎం. కానీ పాకిస్తాన్ పీఎం కాశ్మీర్ అంశాన్ని లేవనెత్తి అభాసు పాలయ్యారు.
Also Read : దేశం కోసం రేయింబవళ్లు పని చేస్తా – సునక్