AAP MLAS CBI : బీజేపీ కూల్చివేత‌ల‌పై సీబీఐకి ఫిర్యాదు- ఆప్

విచార‌ణ జ‌రిపించాల‌ని డిమాండ్

AAP MLAS CBI : ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ, భార‌తీయ జ‌న‌తా పార్టీ మ‌ధ్య ఆరోప‌ణ‌ల ప‌ర్వం తారా స్థాయికి చేరుకుంది. ఒక‌రిపై మ‌రొక‌రు విమ‌ర్శ‌లు చేసుకుంటున్నారు.

ఇప్ప‌టికే మ‌ద్యం పాల‌సీ స్కాంపై ఆప్ స‌ర్కార్ ను ఇరుకున పెట్టింది కేంద్రం. ఈ మేర‌కు కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ సీబీఐ రంగంలోకి దిగింది. డిప్యూటీ సీఎం ఇంటిపై సోదాలు చేప‌ట్టింది.

14 గంట‌ల‌కు పైగా సోదాలు నిర్వ‌హించి మొబైల్ , కంప్యూట‌ర్ల‌ను సీజ్ చేసింది. ఆపై డిప్యూటీ సీఎంతో పాటు మ‌రో 14 మంది ఉన్న‌తాధికారుల‌పై అభియోగాలు మోపింది.

సిసోడియాను నెంబ‌ర్ వ‌న్ గా చేర్చింది. తాజాగా ఆప్ ఎమ్మెల్యేలు సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. ప్ర‌భుత్వాల‌ను కూల్చేందుకు బీజేపీ కుట్ర ప‌న్నుతోందంటూ వారంతా సీబీఐ(AAP MLAS CBI)  కార్యాల‌యాన్ని సంద‌ర్శించారు.

మోదీ కొలువు తీరిన ఎనిమిదేళ్ల కాలంలో ఎనిమిది ప్ర‌భుత్వాల‌ను కూల్చారంటూ దీనిపై స‌మ‌గ్ర విచార‌ణ జ‌రిపించాల‌ని డిమాండ్ చేశారు.

బీజేపీయేత‌ర పాలిత రాష్ట్రాల‌లో ప్ర‌భుత్వాలు ఒక దాని వెంట మ‌రొక‌టి ప‌డి పోతోంద‌ని దీని వెనుక కేంద్రం, బీజీపీ ఉంద‌న్న అనుమానం వ్య‌క్తం చేశారు.

దీనిపై స‌మ‌గ్ర విచార‌ణ జ‌రిపించి ప్ర‌భుత్వాలు కూల‌కుండా చూడాల‌ని సీబీఐని కోరామ‌న్నారు ఆప్ ఎమ్మెల్యే అతిషి. మొత్తం ఇప్ప‌టి వ‌ర‌కు మోదీ సాధించిన ఘ‌న‌త ఏమిటంటే 277 ఎమ్మెల్యేల‌ను రూ. 800 కోట్ల‌కు కొనుగోలు చేయ‌డం త‌ప్ప మ‌రొక‌టి కాద‌న్నారు.

10 మంది ఎమ్మెల్యేలు సీబీఐకి ఫిర్యాదు చేశార‌న్నారు. ఆప‌రేష‌న్ లోట‌స్ లో భాగంగా అరుణాచ‌ల్ ప్ర‌దేశ్ , మేఘాల‌య‌, క‌ర్ణాట‌క‌, గోవా, మ‌ధ్య ప్ర‌దేశ్ , మ‌హారాష్ట్ర ల‌లో ప్ర‌భుత్వాల‌ను మార్చ‌డంలో బీజేపీ విజ‌యం సాధించింద‌ని ఆరోపించారు.

ఢిల్లీలోనూ అలాంటి ప్ర‌య‌త్నమే జ‌రుగుతోంద‌న్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు ప్ర‌భుత్వాల‌ను కూల్చేందుకు కేంద్రం రూ. 6, 300 కోట్లు ఖ‌ర్చు చేసింద‌న్నారు.

Also Read : తాగేటోళ్ల‌కు ఆప్ స‌ర్కార్ ఖుష్ క‌బ‌ర్

Leave A Reply

Your Email Id will not be published!