Seema Patra : బీజేపీ నాయకురాలు సీమా పాత్ర అరెస్ట్
పని మనిషికి నరక యాతన చూపించింది
Seema Patra : జార్ఖండ్ లో దారుణం చోటు చేసుకుంది. నిత్యం నీతి సూత్రాలు , జాతీయ వాదాన్ని పదే పదే చెప్పే భారతీయ జనతా పార్టీకి చెందిన నాయకురాలు సీమా పాత్ర అసలు స్వరూపం బయట పడింది.
దెబ్బకు దిగి వచ్చింది. పని మనిషిని ఎలా చిత్రహింసలకు గురి చేసిందో సాక్షాత్తూ వీడియోలు బయటకు వచ్చాయి. సోషల్ మీడియాను షేక్ చేశాయి. దీంతో పెద్ద ఎత్తున నెటిజన్లు, ఇతర పార్టీలు ఆమెను తూర్పారబట్టాయి.
గత్యంతరం లేని పరిస్థితుల్లో బీజేపీ నేత సీమా పాత్రను(Seema Patra) అరెస్ట్ చేశారు పోలీసులు. ఉదయం ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఈ దారుణాన్ని బహిర్గతం చేసినందుకు గాను ఆమె కొడుకును ఆస్పత్రికి తరలించారు.
ఈ వీడియోలు హల్ చల్ చేశాయి సోషల్ మీడియాలో. సీమా పాత్ర పెడుతున్న చిత్రహింసలతో కలత చెందిన ఆమె కుమారుడు ఆయుష్మాన్ ఆ వీడియోలను తన స్నేహితుడైన ప్రభుత్వ ఉద్యోగితో పంచుకున్నట్లు సమాచారం.
వివేక్ ఆనంద్ బాస్కీ అనే స్నేహితుడు వీడియోలతో పోలీసులను ఆశ్రయించాడు. సీమా పాత్ర తన కొడుకు సునీతకు సాయం చేస్తున్నాడని తెలుసుకుని రాంచీ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ న్యూరో సైకియాట్రి అండ్ అలైడ్ సైన్సెస్ లో చేర్పించింది.
అతడు అనారోగ్యంతో ఉన్నందున ఆస్పత్రికి పంపినట్లు తెలిపింది సీమా పాత్ర. తాను నిర్దోషినని తనకు ఏమీ లేదని తెలిపింది. సీమా పాత్ర భర్త మహేశ్వర్ పాత్ర రిటైర్డ్ ఐపీఎస్ అధికారి.
తనను బందీగా ఉంచి చిత్రహింసలకు గురి చేశారని , ఇనుప రాడ్ తో కొట్టారని బాధితురాలు ఆరోపించింది. రోజుల తరబడి ఆహారం, నీరు ఇవ్వలేదని వాపోయింది.
Also Read : మోదీ మౌనం షెహబాజ్ రాద్ధాంతం