Punjab Liquor Scam : పంజాబ్ లిక్క‌ర్ పాలసీలో భారీ స్కాం

గ‌వ‌ర్న‌ర్ కు ఫిర్యాదు చేసిన ప్ర‌తిప‌క్షాలు

Punjab Liquor Scam : ఢిల్లీలో ఆప్ స‌ర్కార్ మ‌ద్యం పాల‌సీ పేరుతో భారీ స్కాంకు పాల్ప‌డింద‌ని ఇప్ప‌టికే బీజేపీ ఆరోపించింది. ఆ మేర‌కు లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ర్ ఆదేశం మేర‌కు ప‌లువురిని తప్పించారు.

మ‌రో వైపు సీబీఐ రంగంలోకి దిగింది. డిప్యూటీ సీఎం మ‌నీష్ సిసోడియా ఇంటిపై సోదాలు జ‌రిపింది. 14 గంట‌ల పాటు సోదాలు చేప‌ట్టింది. మొబైల్ తో పాటు కంప్యూట‌ర్ల‌ను సీజ్ చేసింది.

ఆపై సిసోడియాతో పాటు 14 మంది ఉన్నతాధికారుల‌పై అభియోగాలు మోపింది. ఈ త‌రుణంలో ఇదే పాల‌సీని పంజాబ్ లో అమ‌లు చేశారంటూ పంజాబ్ కు చెందిన ప్ర‌తిప‌క్ష పార్టీలు శిరోమ‌ణి అకాళీద‌ళ్ నేత సుఖ్ బీర్ సింగ్ బాద‌ల్, ఇత‌ర నేత‌ల‌తో క‌లిసి గ‌వ‌ర్న‌ర్ కు విన‌తి ప‌త్రం స‌మ‌ర్పించారు.

ఈ మేర‌కు పంజాబ్ మ‌ద్యం పాల‌సీలో రూ. 500 కోట్ల అవినీతి చోటు(Punjab Liquor Scam) చేసుకుంద‌ని ఆరోపించారు. దీనిపై వెంట‌నే ఢిల్లీ లో లాగా పంజాబ్ పాల‌సీపై వెంట‌నే సీబీఐ , ఈడీ తో ద‌ర్యాప్తు చేప‌ట్టాల‌ని వారు కోరారు.

ఇందులో భారీ ఎత్తున అవినీతి, అక్ర‌మాలు చోటు చేసుకున్నాయంటూ ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఆప్ నీతి వంత‌మైన పాల‌న పేరుతో ప్ర‌జ‌ల నెత్తిన శ‌ఠ‌గోపం పెట్టింద‌ని మండిప‌డ్డారు బాద‌ల్.

గ‌వ‌ర్న‌ర్ బ‌న్వ‌రీలాల్ పురోహిత్ ను క‌లిసి మ‌ద్యం విధానానికి వ్య‌తిరేకంగా మెమోరాండం స‌మ‌ర్పించారు. సీఎంగా భ‌గ‌వంత్ మాన్ బాధ్య‌త‌లు స్వీక‌రించిన కొద్ది నెల‌ల‌కే రాష్ట్రంలో రూ. 500 కోట్ల కుంభ‌కోణం జ‌రిగింద‌ని ఆరోపించారు.

వెంట‌నే కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ‌లకు అప్ప‌గించాల‌ని కోరారు. ఇందుకు స‌మ్మ‌తించారు గ‌వ‌ర్న‌ర్ భ‌న్వ‌రిలాల్.

Also Read : బీజేపీ నాయ‌కురాలు సీమా పాత్ర అరెస్ట్

Leave A Reply

Your Email Id will not be published!