Bibek Debroy : భార‌త ఎకాన‌మీకి ఢోకా లేదు – చైర్మ‌న్

వివేక్ దేవ్ రాయ్ కీల‌క కామెంట్స్

Bibek Debroy :  ఓ వైపు దేశంలో ద్ర‌వ్యోల్బ‌ణం, నిరుద్యోగం నానాటికీ ఆందోళ‌న క‌లిగిస్తుంటే ప్ర‌ధాన మంత్రి మోదీ ఆర్థిక స‌ల‌హా మండ‌లి చైర్మ‌న్ వివేక్ దేవ్ రాయ్(Bibek Debroy)  మాత్రం చిలుక ప‌లుకులు ప‌లుకుతున్నారు.

రాబోయే 25 సంవ‌త్స‌రాల‌లో వ‌ర‌ల్డ్ వైడ్ గా చూసుకుంటే వ్యాపార‌, వాణిజ్య రంగంలో భార‌త్ కు తిరుగంటూ ఉండ‌ద‌న్నారు. స‌గ‌టున 7 నుంచి 7.5 శాతం వృద్ది రేటును సాధిస్తే ఎగువ మ‌ధ్య త‌ర‌గ‌తి క‌లిగిన ఆదాయ దేశంగా ఉద్భ‌విస్తుంద‌న్నారు.

వామ్మో త‌ల‌స‌రి ఆదాయం 10 వేల డాల‌ర్ల‌కు చేరుకుంటుంద‌ని అంచ‌నా వేశారు. ఏ దేశ‌మైన త‌ల‌స‌రి ఆదాయం 12 వేల డాల‌ర్లు దాటితే అభివృద్ది చెందిన దేశంగా ప్ర‌పంచ బ్యాంకు ప‌రిగ‌ణిస్తుంది.

ఇక అంచ‌నా ప‌రంగా చూస్తే భార‌త ఆర్థిక విలువ రేటు 2.7 ట్రిలియ‌న్ డాల‌ర్లుగా ఉంది. వ‌ర‌ల్డ్ వైడ్ గా చూస్తే ఇండియా ఎమ‌ర్జింగ్ ఎకాన‌మీ దిశ‌గా దూసుకు పోతోంది.

ది కాంపిటేటివ్ నెస్ రోడ్ మ్యాప్ ఫ‌ర్ ఇండియా 100 అనే పేరుతో వివేక్ దేవ్ రాయ్ ఓ నివేదిక‌ను విడుద‌ల చేశారు. ప్రొఫెస‌ర్ మైఖేల్ ఇ పోర్ట‌ర్ , క్రిష్టియ‌న్ కెటెల్స్ , అమిత్ క‌పూర్ ల‌తో క‌లిసి ఈ డెవ‌ల‌ప్ మెంట్ రిపోర్టును త‌యారు చేశారు.

దేశాభివృద్దిలో రాష్ట్రాల పాత్ర కీల‌క‌మ‌న్నారు. వృద్ది రేటును ఎంత ఎక్కువ‌గా న‌మోదు చేస్తే అంత ఎక్కువ‌గా భార‌త్ పురోగ‌మ‌న బాట‌లో ప్ర‌యాణం చేస్తుంద‌న్నారు.

అయితే ప్ర‌తి ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాన‌ని, న‌ల్ల ధ‌నం తీసుకు వ‌స్తాన‌ని, 15 ల‌క్ష‌లు జ‌మ చేస్తాన‌న్న మోదీ(PM Modi) చెప్పిన మాట‌ల‌ను మాత్రం వెల్ల‌డించ‌క పోవ‌డం విశేషం.

Also Read : ‘పుష్ప గ‌ణేషా’ నెట్టింట్లో హ‌ల్ చ‌ల్

Leave A Reply

Your Email Id will not be published!