Cervical Vaccine : గ‌ర్భాశ‌య క్యాన్స‌ర్ కోసం స్వ‌దేశీ వ్యాక్సిన్

సెప్టెంబ‌ర్ 1 నుంచి దేశ మంత‌టా అమ‌లు

Cervical Vaccine :  దేశ వ్యాప్తంగా మ‌హిళ‌లు గ‌ర్భాశ‌య క్యాన్స‌ర్ కు గ‌త కొంత కాలం నుంచీ గుర‌వుతూ వ‌స్తున్నారు. ఈ మేర‌కు మోదీ ప్ర‌భుత్వం దీనిపై ఎక్కువ‌గా ఫోక‌స్ పెట్టింది.

ఇందుకు సంబంధించి క్యాన్స‌ర్ నివార‌ణ‌కు గాను మొద‌టి స్వ‌దేశీ వ్యాక్సిన్ ను సెప్టెంబ‌ర్ 1 నుంచి ప్రారంభించ‌నుంది. త‌క్కువ ధ‌ర‌, నాణ్య‌మైన టీకా త‌యారు చేయ‌డం జ‌రిగింద‌ని కేంద్రం వెల్ల‌డించింది.

ఈ స్వ‌దేశీ వ్యాక్సిన్ 9 నుంచి 14 ఏళ్ల వ‌యస్సు క‌లిగిన దాదాపు 50 మిలియ‌న్ల బాలిక‌ల‌కు ఉప‌యోగ‌క‌రంగా ఉంటుంద‌ని భావిస్తున్నారు. గ‌ర్భాశ‌య క్యాన్స‌ర్ కు సంబంధించి బాధితులు ప్ర‌పంచంలో నే భార‌త్ ఐదో స్థానంలో ఉన్నార‌ని పేర్కొంది.

దేశంలో ప్ర‌తి సంవ‌త్స‌రం 1.23 ల‌క్ష‌ల కేసులు న‌మోద‌వుతున్నాయి గ‌ర్భాశయ క్యాన్స‌ర్ బారిన ప‌డి 67,000 మ‌ర‌ణాలు సంభ‌విస్తున్నాయ‌ని వెల్ల‌డించింది.

సీరం ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండియా భాగ‌స్వామ్యంతో డిపార్ట్ మెంట్ ఆఫ్ బ‌యో టెక్నాల‌జీ గ‌ర్భాశ‌య క్యాన్స‌ర్ కు వ్య‌తిరేకంగా భార‌త దేశ‌మే తొలిసారిగా త‌యారు చేసిన క్వాడ్రివాలెంట్ హ్యూమ‌న్ పాపిల్లోమావైర‌స్ వ్యాక్సిన్ (Cervical Vaccine) (క్యూహెచ్ పీవీ ) ను గురువారం ప్రారంభించ‌నున్న‌ట్లు కేంద్ర స‌ర్కార్ వెల్ల‌డించింది.

ఈ వ్యాక్సిన్ ను కేంద్ర స‌హాయ మంత్రి జితేంద్ర సింగ్ ఢిల్లీలో ప్రారంభించ‌నున్న‌ట్లు తెలిపింది. కొత్త వ్యాక్సిన్ వీఎల్పీ (వైర‌స్ వంటి క‌ణాల‌)పై ఆధార‌ప‌డి ఉంద‌ని , హెప‌టైటిస్ బి వ్యాక్సిన్ లాగా , హెచ్ పీవీ వైరస్ ఎల్1 ప్రోటీన్ కు వ్య‌తిరేకంగా ప్ర‌తి రోధ‌కాల‌ను ఉత్ప‌త్తి చేయ‌డం ద్వార రక్ష‌ణ‌ను అందించేందుకు త‌యారు చేయ‌బ‌డింద‌ని డీబీటీ తెలిపింది.

Also Read : హ‌ర్ సిమ్ర‌త్ కౌర్ కు కేంద్రం బిగ్ షాక్

Leave A Reply

Your Email Id will not be published!