PM Modi : సోనియా త‌ల్లి మృతి బాధాక‌రం – మోదీ

ఆమె ఆత్మ‌కు శాంతి చేకూరాల‌ని ట్వీట్

PM Modi :  ఏఐసీసీ తాత్కాలిక చీఫ్ సోనియా గాంధీ త‌ల్లి పావోలా మైనో మ‌ర‌ణించారు. ఈ విష‌యం తెలుసుకున్న ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ తీవ్ర సంతాపం తెలిపారు. ఆమె ఆత్మ‌కు శాంతి చేకూరాల‌ని కోరారు.

త‌న అధికారిక ట్విట్ట‌ర్ లో విష‌యం తెలిసి తాను బాధ‌కు గురైన‌ట్లు పేర్కొన్నారు ప్ర‌ధాన‌మంత్రి(PM Modi). ఇదిలా ఉండ‌గా శ‌నివారం ఇట‌లీ లోని త‌న స్వంత ఇంట్లో క‌న్ను మూశార‌ని, ఆమె అంత్య‌క్రియ‌లు ఆదివారం జ‌రిగిన‌ట్లు కాంగ్రెస్ పార్టీ ప్ర‌క‌టించింది.

త‌ల్లి మ‌రణాంత‌రం సంతాప సందేశాన్ని ట్వీట్ చేశారు. పావోలో మైనో మ‌ర‌ణించినందుకు సోనియా గాంధీకి సంతాపం తెలియ చేస్తున్నాను.

ఈ దుఖః స‌మ‌యంలో నా ఆలోచ‌న‌లు మొత్తం కుటుంబ స‌భ్యుల‌తో ఉన్నాయ‌ని స్పష్టం చేశారు ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ.

ఇదిలా ఉండ‌గా సోనియా గాంధీ , ఆమె కుమారుడు రాహుల్ గాంధీ, కూతురు ప్రియాంక గాంధీ వాద్రా విదేశాల్లో ఉన్నారు. విష‌యం తెలిసిన వెంట‌నే వారంతా హుటా హుటిన ఇట‌లీకి వెళ్లారు.

90 ఏళ్ల వ‌య‌స్సులో అనారోగ్యంతో ఉన్న త‌న త‌ల్లిని క‌లిసేందుకు కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక చీఫ్ సోనియా గాంధీ(Sonia Gandhi) ఆగ‌స్టు 23న బ‌య‌లు దేరి వెళ్లారు. పార్టీ మొత్తం సోనియా కుటుంబానికి ప్ర‌గాఢ సంతాపం తెలియ చేసింది.

పార్టీకి చెందిన బాధ్యులు, సీనియ‌ర్ నాయ‌కులు తీవ్ర సంతాపం తెలియ చేశారు. సోనియా గాంధీ త‌ల్లి పావోలా మైనో ఆత్మ‌కు శాంతి చేకూరాల‌ని ప్రార్థించారు.

మ‌రో వైపు సోనియా గాంధీ కూడా ఇటీవ‌లే క‌రోనా నుంచి కోలుకున్నారు. అంత‌లోనే ఈ వార్త చోటు చేసుకుంది.

Also Read : మోదీకి పాకిస్తాన్ పీఎం థ్యాంక్స్

Leave A Reply

Your Email Id will not be published!