Arvind Kejriwal : గుజ‌రాత్ సీఎంపై కేజ్రీవాల్ ఆగ్ర‌హం

ఆప్ నేత‌పై దాడికి మీదే బాధ్య‌త

Arvind Kejriwal : ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్‌, ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal) నిప్పులు చెరిగారు. గుజ‌రాత్ లో రోజు రోజుకు దాడులు పెరిగి పోతున్నాయ‌ని మండిప‌డ్డారు. ప్ర‌తిప‌క్షాల‌కు చెందిన వారిని ల‌క్ష్యంగా చేసుకుని దాడుల‌కు పాల్ప‌డుతున్నారంటూ ఆరోపించారు.

గెల‌వ‌డం ఓడి పోవ‌డం ఎన్నిక‌ల్లో స‌ర్వ సాధార‌ణ‌మ‌న్నారు. ఇవాళ ఆయ‌న మీడియాతో మాట్లాడారు కేజ్రీవాల్. హింసాత్మ‌క చ‌ర్య‌ల‌కు పాల్ప‌డ‌డం, భ‌య‌భ్రాంతుల‌కు గురి చేయ‌డం వ‌ల్ల ప్ర‌జాస్వామ్యం మ‌న జాల‌ద‌న్నారు.

ప్ర‌త్యేకించి గుజ‌రాత్ కు చెందిన ఆమ్ ఆద్మీ పార్టీ నేత మ‌నోజ్ సోర‌థియాపై దాడికి దిగ‌డాన్ని తీవ్రంగా త‌ప్పు ప‌ట్టారు అర‌వింద్ కేజ్రీవాల్. ఈ సంద‌ర్భంగా అత‌డికి ప్రాణ హాని ఉంద‌ని ర‌క్ష‌ణ క‌ల్పించాల‌ని డిమాండ్ చేశారు.

దీనికి ప్ర‌ధానంగా బాధ్య‌త వ‌హించాల‌ని గుజ‌రాత్ సిఎం కు స్ప‌ష్టం చేశారు. కొంద‌రు కావాల‌నే త‌మ నాయ‌కుడిపై దాడికి పాల్ప‌డ్డారంటూ ఆరోపించారు.

ఎవ‌రు ఇందులో ప్ర‌త్య‌క్షంగా దాడికి పాల్ప‌డ్డారో వారిని వెంట‌నే గుర్తించి అరెస్ట్ చేయాల‌ని కేజ్రీవాల్(Arvind Kejriwal) డిమాండ్ చేశారు. లేక పోతే తీవ్ర ప‌రిణామాలు ఎదుర్కోవాల్సి వ‌స్తుంద‌ని హెచ్చ‌రించారు ఆప్ చీఫ్‌.

ఈ ఘ‌ట‌న‌పై పార్టీ కార్య‌క‌ర్త చేసిన ట్వీట్ కు అర‌వింద్ కేజ్రీవాల్ కు స‌మాధానం ఇచ్చారు. ప్ర‌తిప‌క్షాల‌ను నిర్మూలించాల‌ని అనుకోవ‌డం భ్ర‌మ అని పేర్కొన్నారు.

ఏదైనా ప్ర‌త్య‌క్షంగా ఎన్నిక‌ల్లో తేల్చుకోవాల‌ని వ్య‌క్తుల‌ను లేకుండా చేయాల‌ని అనుకోవ‌డం మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు. గ‌త 27 ఏళ్లుగా రాష్ట్రంలో పాలిస్తున్న బీజేపీ ప్ర‌భుత్వం ఏం చేసిందో చెప్పాల‌ని డిమాండ్ చేశారు కేజ్రీవాల్.

Also Read : ఆప్ నేత‌ల‌పై ఎల్జీ ప‌రువు న‌ష్టం దావా

Leave A Reply

Your Email Id will not be published!