CM KCR Lalu :  లాలూతో కేసీఆర్ భేటీ ఆరోగ్యంపై ఆరా

బీహార్ టూర్ లో తెలంగాణ సీఎం బిజీ

CM KCR Lalu :  బీహార్ లో ప‌ర్య‌ట‌న‌లో ఉన్న తెలంగాణ సీఎం కేసీఆర్(CM KCR Lalu) బిజీ బిజీగా గ‌డిపారు. ఆయ‌న ఆర్జేడీ మాజీ సీఎం లాలూ ప్ర‌సాద్ యాద‌వ్ నివాసానికి వెళ్లారు. ఆయ‌న ఆరోగ్యం గురించి ఆరా తీశారు.

దేశంలో చోటు చేసుకున్న రాజ‌కీయాల‌పై చ‌ర్చించారు. ఈ సంద‌ర్భంగా డిప్యూటీ సీఎంగా కొలువు తీరిన తేజ‌స్వి యాద‌వ్ ను ప్ర‌త్యేకంగా అభినందించారు.

అనంత‌రం సీఎం నితీశ్ కుమార్ ను క‌లుసుకున్నారు కేసీఆర్. తెలంగాణ రాష్ట్రం ఆయ‌న వ‌ల్ల‌నే సాధ్య‌మైంద‌న్నారు. ఈ క్రెడిట్ అంతా ఆయ‌న‌కే ద‌క్కుతుంద‌న్నారు.

భార‌తీయ జ‌న‌తా పార్టీ చేస్తున్న విమ‌ర్శ‌ల‌ను ప‌ట్టించు కోకుండా ముందుకు సాగాల‌ని పిలుపునిచ్చారు. క‌లిసి వ‌చ్చే వాళ్ల‌ను ఆహ్వానిస్తామ‌ని క‌లిసి రాని వాళ్ల‌ను తాము ప‌ట్టించుకునే ప్ర‌స‌క్తి లేద‌న్నారు.

ఇటీవ‌లే 17 ఏళ్ల అనుబంధానికి చెక్ పెట్టారు జేడీయూ చీఫ్‌, సీఎం నితీశ్ కుమార్. బీజేపీకి కోలుకోలేని షాక్ ఇచ్చారు. ఇదే స‌మ‌యంలో ప్ర‌తిప‌క్షాల‌తో క‌లిసి ఒకే రోజులో ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేశారు.

31 మందితో కొత్త మంత్రివ‌ర్గాన్ని ఏర్పాటు చేశారు. దేశంలో గుణాత్మ‌క మార్పు అవ‌స‌రమ‌ని స్పష్టం చేశారు సీఎం కేసీఆర్. బీజేపీ వ్య‌తిరేక శ‌క్తుల‌న్నీ ఏక‌తాటిపైకి రావాలన్నారు.

కాగా ఎవ‌రు నాయ‌క‌త్వం వ‌హిస్తార‌నే దానిపై అంత తొంద‌ర ప‌డాల్సిన అవ‌స‌రం లేద‌న్న అభిప్రాయం వ్య‌క్తం చేశారు. లా అండ్ ఆర్డ‌ర్ రాష్ట్రాల్లోని అంశాల‌ని కానీ కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ‌లు ఎలా దూరుతాయ‌ని, ఎందుకు జోక్యం చేసుకుంటాయ‌ని ప్ర‌శ్నించారు.

ప్ర‌స్తుతం కేసీఆర్ చేసిన కామెంట్స్ క‌ల‌క‌లం రేపుతున్నాయి.

Also Read : దేశం నుంచి బీజేపీని త‌రిమి కొట్టాలి

Leave A Reply

Your Email Id will not be published!