DK Shiva Kumar : దేశానికి కర్ణాటక అవినీతి రాజధాని – డీకే
కేపీసీసీ చీఫ్ డీకే శివకుమార్ ఫైర్
DK Shiva Kumar : కర్ణాటక పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ షాకింగ్ కామెంట్స్ చేశారు. దేశానికి సంబంధించిన అవినీతికి కేరాఫ్ కర్ణాటక సర్కార్ నిలిచిందని సంచలన ఆరోపణలు చేశారు.
అవినీతి, ఆరోపణలను కప్పి పుచ్చుకునేందుకే హిజాబ్ , హలాల్, ఈద్గా లాంటి సున్నిత సమస్యలను తెరపైకి తీసుకు వస్తోందంటూ మండిపడ్డారు డీకే శివకుమార్.
కర్ణాటక లాంటి రాష్ట్రంలో ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం దారుణమన్నారు. రాష్ట్రంలో వచ్చే ఏడాది ఎన్నికలకు ముందు బీజేపీ అనేక అవినీతి కుంభకోణాల నుండి దృష్టి మళ్లించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇటీవల ఈద్గా మైదానంలో గణేష్ చతుర్థి(Ganesh Chaturthi) వేడుకలు వంటి మతపరమైన సమస్యలపై దృష్టి సారించిందన్నారు. ఆయన జాతీయ మీడియాతో మాట్లాడారు.
దేశానికి కర్ణాటక అవినీతి రాజధానిగా మారిందని , దానిని కప్పి పుచ్చుకునేందుకే ఇలాంటివి ముందుకు తీసుకు వస్తోందంటూ సీరియస్ అయ్యారు.
కేంద్రంలో కొలువు తీరిన బీజేపీ సర్కార్ పూర్తిగా కులం, మతం, ప్రాంతాల పేరుతో రాజకీయాలు చేస్తున్నారంటూ ధ్మజమెత్తారు. బెంగళూరు లోని ఈద్గా మైదానంలో గణేష్ ఉత్సవాలకు పర్మిషన్ ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
కాగా హుబ్బళ్లీ లోని ఈద్గా మైదానంలో వేడుకలకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. దీనిపై తాను కామెంట్ చేయదల్చు కోలేదన్నాడు. కానీ బీజేపీ చేస్తున్న నీతి మాలిన రాజకీయాలకు ప్రజలు తగిన రీతిలో బుద్ది చెప్పడం ఖాయమన్నారు డీకే శివకుమార్(DK Shiva Kumar).
సీఎం బొమ్మై ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని విద్యా సంస్థల సంఘాల ప్రతినిధులు నేరుగా ప్రధానమంత్రి మోదీకి లేఖ రాశాయని స్పష్టం చేశారు. కాసులు ఇవ్వనిదే పనులు కావడం లేదని వారు అందులో పేర్కొన్నారంటూ తెలిపారు డీకే శివకుమార్.
Also Read : గోయల్ నివాసంలో గణపతికి మోదీ హారతి