Pakistan PM Modi : మోదీకి పాకిస్తాన్ పీఎం థ్యాంక్స్
వినాశకరమైన వరదలపై ఆందోళన
Pakistan PM Modi : ప్రకృతి ప్రకోపానికి పాకిస్తాన్ తల్లడిల్లింది. అనుకోని వర్షాలు, వరదల దెబ్బకు ఏకంగా 1,100 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. భారీ ఎత్తున ఆస్తి, ప్రాణ నష్టం చోటు చేసుకుంది.
ఈ సందర్భంగా దాయాది పాకిస్తాన్ లో చోటు చేసుకున్న ఈ విపత్కర పరిస్థితులను చూసి తాను చలించి పోయానని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు భారత దేశ ప్రధాన మంత్రి నరేంద్ర దామోదర దాస్ మోదీ(Pakistan PM Modi).
ఈ మేరకు ట్విట్టర్ వేదికగా తీవ్ర సంతాపం తెలిపారు. అంతే కాకుండా పొరుగున ఉన్న పాకిస్తాన్ కు పూర్తి భరోసా ఇచ్చారు. తాము ఎలాంటి సహాయం చేసేందుకైనా సిద్దంగా ఉన్నామని స్పష్టం చేశారు.
ఇరు దేశాల మధ్య విభేదాలు ఉన్నప్పటికీ సానుభూతి తెలియ చేయడంతో పాటు కొండంత భరోసా ఇచ్చినందుకు పాకిస్తాన్ దేశ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ సంతోషం వ్యక్తం చేశారు.
ఈ మేరకు ఆయన ట్విట్టర్ ద్వారా భారత ప్రధానికి కృతజ్ఞతలు తెలిపారు. మీరు సహృదయంతో మా పట్ల కరుణ చూపినందుకు గర్వకారణంగా ఉంది.
అనుకోని విపత్కర పరిస్థితులు ఎదురు కావడం బాధకరంగా ఉంది. ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని ఈ సందర్భంగా తెలియ చేస్తున్నానని పేర్కొన్నారు.
దేశ జనాభాలో 7వ వంతు మంది నిరాశ్రయులు అయ్యారు. వినాశకరమైన వరదల మధ్య జరిగిన నష్టంపై ఆందోళన చేయడం నన్ను కదిలించి వేసిందన్నారు పాకిస్తాన్ ప్రధాన మంత్రి(Pak PM).
మీరు సహాయం చేస్తానని ప్రకటించినందుకు మిమ్మల్ని ప్రత్యేకంగా అభినందిస్తున్నట్లు పాక్ పీఎం తెలిపారు.
Also Read : గోయల్ నివాసంలో గణపతికి మోదీ హారతి