PM Modi Aarti : గోయ‌ల్ నివాసంలో గ‌ణ‌ప‌తికి మోదీ హార‌తి

వినాయ‌కుడికి పూజ‌లు చేసిన ప్ర‌ధాన‌మంత్రి

PM Modi Aarti : వినాయ‌క చ‌వితి సంద‌ర్భంగా ప్ర‌ధాన మంత్రి ప్ర‌త్యేక పూజ‌లు చేశారు. ఆయ‌న కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ నివాసానికి చేరుకున్నారు. అక్క‌డ ఏర్పాటు చేసిన గ‌ణ‌నాథుడికి పూజ‌లు చేసి హార‌తి(PM Modi Aarti)  స‌మ‌ర్పించారు.

ఇందుకు సంబంధించిన ఫోటోలు హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి నెట్టింట్లో. ఈ పండుగ‌ను ప్ర‌తి ఏటా భార‌త దేశంలో అత్యంత వైభ‌గ‌వంగా, ప్ర‌తిష్టాత్మ‌కంగా జ‌రుపుకుంటారు. ప్ర‌ధానంగా మ‌రాఠాలో దీనిని ఒక గొప్ప వేడుక‌గా నిర్వ‌హిస్తారు.

గ‌ణ‌ప‌తి బొప్పా మోరియా అన్న నినాదాల‌తో దేశం యావ‌త్తు ఊగిపోతోంది. ప్ర‌స్తుతం ఎక్క‌డ చూసినా వినాయ‌కుడి విగ్ర‌హాల‌తో కొలువు తీరాయి. ల‌క్ష‌లాది మంది భ‌క్తులు దేవాల‌యాల‌ను సంద‌ర్శిస్తున్నారు.

లేని చోట వినాయ‌కుడి విగ్ర‌హాల‌ను ప్ర‌తిష్టించి కొలుస్తున్నారు. వినాయ‌క చ‌వితిని ఈసారి ప్ర‌త్యేకంగా ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ గోయల్ ఇంట్లో జ‌రుపు కోవ‌డం విశేషం.

అంత‌కు ముందు రోజు దేశ ప్ర‌జ‌ల‌కు మోదీ గ‌ణేష్ ఉత్స‌వ శుభాకాంక్ష‌లు తెలిపారు. శ్రీ గ‌ణేశ భ‌గ‌వానుడి ఆశీస్సులు ఎల్ల‌ప్పుడూ ప్ర‌జ‌లంద‌రికీ, దేశానికి ఉండాల‌ని కోరారు.

ఇదే విష‌యాన్ని ప్ర‌ధాన మంత్రి త‌న ట్విట్ట‌ర్ లో ట్వీట్ చేశారు. రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ము(Draupadi Murmu) కూడా వినాయ‌క చ‌వితి సంద‌ర్భంగా శుభాకాంక్ష‌లు తెలిపారు.

పౌరుల జీవితాల్లో శాంతి, శ్రేయ‌స్సు విల‌సిల్లాల‌ని కోరారు. కేంద్ర మంత్రి అమిత్ చంద్ర షా కూడా దేశ ప్ర‌జ‌లంద‌రికీ గ‌ణేశ్ చ‌తుర్థి అభినంద‌న‌లు తెలిపారు.

ఇదిలా ఉండ‌గా ఆగ‌స్టు 31న ప్రారంభ‌మైన ఈ ఉత్స‌వాలు సెప్టెంబ‌ర్ 9న ముగుస్తాయి. మ‌హారాష్ట్ర‌, త‌మినాడు, క‌ర్నాట‌క‌, గుజ‌రాత్ , త‌దిత‌ర రాష్ట్రాల‌లో వినాయ‌క ఉత్స‌వాలు వైభ‌వోపేతంగా జ‌రుగుతాయి.

Also Read : గ‌ణేషా..వార్న‌ర్ భయ్యా వారెవ్వా

Leave A Reply

Your Email Id will not be published!