Google Truth Ban : ట్రంప్ సోష‌ల్ మీడియాకు నో చాన్స్

గూగుల్ యాప్ స్టోర్ లో చోటుండ‌దు

Google Truth Ban : అమెరికా మాజీ అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ కు కోలుకోలేని షాక్ ఇచ్చింది మ‌రోసారి టెక్ దిగ్గ‌జం గూగుల్. త‌న యాప్ స్టోర్ నుండి ట్రంప్ కు చెందిన సోష‌ల్ మీడియా ప్లాట్ ఫార‌మ్ లో చోటు ఉండ‌ద‌ని స్ప‌ష్టం చేసింది.

త‌మ రూల్స్ కు వ్య‌తిరేకంగా ఉండే దేనినీ తాము స్వీక‌రించ బోమంటూ తెలిపింది. అది ప్రెసిడెంట్ అయినా లేదా సామాన్యుడైనా ఎవ‌రు రూపొందించినా త‌మకంటూ కొన్ని నియ‌మ నిబంధ‌న‌లు ఉంటాయ‌ని పేర్కొంది.

ఇదే స‌మ‌యంలో ట్రంప్ కు చెందిన ట్రూత్ సోష‌ల్ యాప్ ప్లే విధానాల‌ను ఉల్లంఘిస్తోంద‌ని ఆరోపించింది గూగుల్(Google Truth Ban). ప్లాట్ ఫారమ్ లో అందించేందుకు వినియోగ‌దారుడు సృష్టించిన కంటెంట్ ని మోడ‌రేట్ చేసేందుకు స‌మ‌ర్థ‌వంత‌మైన సిస్ట‌మ్ లు అవ‌స‌ర‌మ‌ని గూగుల్ తెలిపింది.

టెక్ కంపెనీ తెలిపిన వివ‌రాల మేర‌కు త‌న యాప్ స్టోర్ నుండి ట్రంప్ ట్రూత్ ప్లాట్ ఫార‌మ్ ను క‌చ్చితంంగా అడ్డుకుంటుంది. భౌతిక బెదిరింపులు, హింస‌ను ప్రేరేపించే కంటెంట్ ను మిన‌హాయించే రూల్స్ ను యాప్ ఉల్లంఘిస్తోంద‌ని ఆరోపించింది గూగుల్.

హింసాత్మ‌క బెదిరింపుల‌తో స‌హా కంటెంట్ నియంత్ర‌ణ‌కు సంబంధించిన నిబంధ‌న‌ల‌కు క‌ట్టుబ‌డి ఉండే దాకా అమెరికా మాజీ చీఫ్ డొనాల్డ్ ట్రంప్ కు చెందిన ట్రూత్ సోష‌ల్ యాప్ గూగుల్ యాప్ స్టోర్ లో ఇష్ట ప‌డ‌ద‌ని గూగుల్ కంపెనీ(Google) ప్ర‌క‌టించింది.

ఎందుకు త‌న యాప్ ను యాక్సెస్ చేయ‌డం లేదో త‌న‌కు తెలియ‌డం లేదంటూ ఆరోపించారు ట్రంప్. ఈ నేప‌థ్యంలో గూగుల్ ఈ ప్ర‌క‌ట‌న చేసింది.

Also Read : 2.7 కోట్ల పోస్ట్ లు తొల‌గింపు – మెటా

Leave A Reply

Your Email Id will not be published!