Arvind Kejriwal : ప్రధాని నిర్వాకం వల్లే ఆప్ కు ఆదరణ
నిప్పులు చెరిగిన సీఎం కేజ్రీవాల్
Arvind Kejriwal : ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal) షాకింగ్ కామెంట్స్ చేశారు. గుజరాత్ రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు,
మోదీ తమపై కక్ష సాధింపు ధోరణి తమ పట్ల ప్రజలలో ఆదరణ పెంచేలా చేస్తోందన్నారు. మద్యం పాలసీ స్కాం పేరుతో డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను టార్గెట్ చేశారని, ఆయనను భయభ్రాంతులకు గురి చేసేలా చేశారని కానీ బెదరలేదన్నారు కేజ్రీవాల్.
కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తున్నారంటూ మండిపడ్డారు. సీబీఐ 14 గంటల పాటు విచారించిందని కానీ ఏ ఒక్క ఆధారం దొరకలేదన్నారు.
చివరకు మొబైల్ ఫోన్ , కంప్యూటర్లను సీజ్ చేశారని చివరకు ఏమీ లేదని తేల్చారంటూ ఎద్దేవా చేశారు. తాము ప్రజల కోసం పని చేస్తుంటే మోదీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అవలంభిస్తోందంటూ ధ్వజమెత్తారు.
ఇదిలా ఉండగా సిసోడియాపై దాడి జరిగిన తర్వాత గుజరాత్ రాష్ట్రంలో ఆప్ ఓట్ షేర్ శాతం 4 శాతం పెరిగిందని ఇది తమకు లాభం కలిగించిన విషయమని పేర్కొన్నారు సీఎం.
ఒకవేళ మనీష్ సిసోడియాను గనుక అరెస్ట్ చేసినట్లయితే తమ ఓటు శాతం 6 శాతానికి పెరగడం ఖాయమని జోష్యం చెప్పారు. అక్రమంగా, కుట్రలు పన్నుతూ ఇరికించాలని కేంద్రం చూస్తోందంటూ ధ్వజమెత్తారు.
తమ పార్టీని దెబ్బ తీసేందుకే ఇలాంటి పనికిమాలిన చర్యలకు దిగారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal). ఆపరేషన్ కమలం పూర్తిగా విఫలమైందని గుర్తు పెట్టుకోవాలన్నారు.
మొత్తంగా మోదీ త్రయం, ఆపరేషన్ కమలం పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు ఆప్ చీఫ్.
Also Read : టీచర్ ను చెట్టుకు కట్టేసిన స్టూడెంట్స్