AAP vs BJP : కేంద్రం గుర్రం వ్యాపారం చేస్తోంది

బ‌ల నిరూప‌ణ‌లో ఆప్ స‌క్సెస్

AAP vs BJP :  నిర‌క్ష‌రాస్యుల వ‌ల్ల దేశానికి ఒరిగేదేమీ ఉండ‌ద‌న్నారు ఆప్ చీఫ్‌, సీఎం కేజ్రీవాల్. ఇండియ‌న్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ (ఐఐటీ)ల‌లో చ‌దువుకున్న వారికి భ‌విష్య‌త్తు అనేది ఉంటుంద‌ని కానీ మ‌తం ప్రాతిప‌దిక‌గా చేసుకుని రాజ‌కీయాలు న‌డుపుతున్న బీజేపీ వారికి ఎలాంటి ఫ్యూచ‌ర్ అంటూ ఉండ‌ద‌న్నారు.

బీజేపీకి తామే ప్ర‌త్యామ్నాయం అని పేర్కొన్నారు. దేశంలో రెండు పార్టీలు మాత్ర‌మే ఉన్నాయ‌ని అవి ఒక‌టి బీజేపీ రెండు ఆమ్ ఆద్మీ(AAP vs BJP) పార్టీ అన్నారు.

త‌న పిల్ల‌లు ఇద్ద‌రూ ఐఐటీల‌లో చదివార‌ని చెప్పారు. నేను సాధార‌ణ వ్య‌క్తిని. నేను సామాన్య‌, మ‌ధ్య త‌ర‌గ‌తి కుటుంబానికి చెందిన వాడిని. నేను క‌ష్ట‌ప‌డి చ‌దువుకున్నా.

ఐఐటీకి వెళ్లాను. మెకానిక‌ల్ ఇంజ‌నీరింగ్ చేశాను. ఇవాళ ఈ స్థాయికి నేను చేరుకోగ‌లిగానంటే కార‌ణం నేను చ‌దువుకున్న చ‌దువు. అది నాకు ల‌భించిన అవ‌కాశం వ‌ల్ల‌నే అని స్ప‌ష్టం చేశారు అర‌వింద్ కేజ్రీవాల్.

భార‌త దేశంలో ప్ర‌తి బిడ్డ‌కు ఒకే విధ‌మైన విద్య‌ను అందించాల‌ని తాను కోరుకుంటున్నాన‌ని చెప్పారు. నా పిల్ల‌ల‌కు అందిన విద్య‌నే వారికి కూడా అందాల‌ని ఆశిస్తున్నాన‌ని స్ప‌ష్టం చేశారు సీఎం.

ఎమ్మెల్యేల‌ను కొనుగోలు చేసేందుకు బీజేపీ రూ. 20 కోట్ల చొప్పున ఒక్కొక్క‌రికి ఖ‌ర్చు చేస్తోంద‌ని ఆరోపించారు. అవే డ‌బ్బుల్ని విద్యాభివృద్ది కోసం ఖ‌ర్చు చేస్తే బావుంటుంద‌న్నారు అర‌వింద్ కేజ్రీవాల్.

నిజాయితీ క‌లిగిన పార్టీకి ఐఐటీ డిగ్రీలు ఉన్న‌వారై ఉంటార‌ని పేర్కొన్నారు. ప్ర‌స్తుతం కేంద్రం గుర్ర‌పు వ్యాపారం చేస్తోందంటూ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు.

Also Read : ప్ర‌ధాని నిర్వాకం వ‌ల్లే ఆప్ కు ఆద‌ర‌ణ

Leave A Reply

Your Email Id will not be published!