Mamata Banerjee : ఆర్ఎస్ఎస్ కు కితాబిచ్చిన దీదీ
బీజేపీకి మద్దతు ఇవ్వని వారున్నారు
Mamata Banerjee : తృణమూల్ కాంగ్రెస్ పార్టీ చీఫ్, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ(Mamata Banerjee) షాకింగ్ కామెంట్స్ చేశారు. కేంద్రం తనపై దాడులు ముమ్మరం చేస్తున్న ప్రయత్నంలో ఉన్నట్టుండి స్వరం మార్చారు.
ఏకంగా భారతీయ జనతా పార్టీని శాసిస్తున్న రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్ ) ను ప్రశంసించారు. బీజేపీ చేస్తున్న చిల్లర రాజకీయాలకు మద్దతు ఇవ్వని వారు ప్రచారక్ లో ఉన్నారంటూ బాంబు పేల్చారు.
ప్రస్తుతం సీఎం చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి. ఆర్ఎస్ఎస్ అంత చెడ్డనైన సంస్థ కాదన్నారు మమతా బెనర్జీ. బెంగాల్ లో జరిగిన రాజకీయ హింసాకాండకు ప్రధాన కారణంగా కాషాయ పార్టీనేనంటూ మండిపడింది సీఎం.
దీంతో రాజకీయ టీ కప్పులో తుపాను చెలరేగింది. కాంగ్రెస్ , సీపీఎం, తదితర పార్టీలు తీవ్రంగా మండిపడ్డాయి మమతా బెనర్జీపై. ఇదిలా ఉండగా ఆర్ఎస్ఎస్ మంచి సంస్థేనంటూ దీదీ వ్యాఖ్యానించడాన్ని బీజేపీ స్పందించింది.
తమ గురించి, సంస్థల గురించి క్లీన్ సర్టిఫికెట్ ఇవ్వాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. ఈ సందర్బంగా ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ షాకింగ్ కామెంట్స్ చేశారు.
ఆయన గురువారం మీడియాతో మాట్లాడారు. 2003లో కూడా మమతా బెనర్జీ ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు దేశ భక్తులు అంటూ కితాబు ఇచ్చారని గుర్తు చేశారు.
ఆమె మాటలను బట్టి చూస్తే దీదీ ఎవరి వైపు ఉందనేది అర్థం అవుతుందన్నారు ఓవైసీ. అయితే టీఎంసీ స్పందించింది. మమతా బెనర్జీ(Mamata Banerjee) ఆర్ఎస్ఎస్ ను ప్రశంసించ లేదని, ప్రతి సంస్థలో మంచి వారు చెడ్డ వారు ఉంటారని అన్నారని సరిదిద్దే ప్రయత్నం చేసింది.
Also Read : కేంద్రం గుర్రం వ్యాపారం చేస్తోంది