PM Modi : గార్డ్ ఆఫ్ హానర్ ను అందుకున్న మోదీ
స్వదేశీ తయారీ ఐఎన్ఎస్ విక్రాంత్ స్టార్ట్
PM Modi : భారత రక్షణ రంగంలో ప్రధాన మైలు రాయిగా నిలిచిన ఐఎన్ఎస్ విక్రాంత్(Vikrant) ను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు కొద్ది సేపటి కిందట.
కమీషనింగ్ కు ముందు కొచ్చి లోని కొచ్చిన్ షిప్ యార్డు లిమిటెడ్ లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ(PM Modi) గార్డ్ ఆఫ్ హానర్ అందుకున్నారు. ఈ షిప్ యార్డు లిమిటెడ్ లో మొట్ట మొదటి స్వదేశీ విమాన వాహన నౌక కావడం విశేషం.
దీనిని ప్రారంభించేందుకు కొచ్చిన్ కు విచ్చేశారు ప్రధాన మంత్రి. ఈ సందర్బంగా గౌరవ వందనం స్వీకరించారు. భారత రక్షణ రంగంలో ఇదో కీలకమైన పరిణామం అని చెప్పక తప్పదు.
ఐఎన్ఎస్ విక్రాంత్ భారత దేశానికి సంబంధించి తొలి స్వదేశీ వాహన నౌక కావడం ప్రాధాన్యత సంతరించచుకుంది. భారత దేశ సముద్ర చరిత్రలో ఇప్పటి దాకా నిర్మించిన అతి పెద్ద నౌక ఇదే. దీనిని రూ. 20, 000 కోట్లతో నిర్మించారు.
ఇందులో క్యారియర్ , హౌసింగ్ స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఆటోమేషన్ ఫీచర్లను కలిగి ఉంది. ఇదిలా ఉండగా ఇండో పసిఫిక్ , హిందూ మహా సముద్ర తీర ప్రాంతంలో శాంతి, స్థిరత్వాన్ని నిర్ధారించేందుకు ఐఎన్ఎస్ విక్రాంత్ దోహదపడుతుంది.
ఐఎన్ఎస్ విక్రాంత్ లో ఎయిర్ క్రాఫ్ట్ ల్యాండింగ్ ట్రయల్స్ నవంబర్ లో ప్రారంభం కానున్నాయి. 2023 మధ్యలో పూర్తవుతాయి. ఇక ఎంఐజీ -29కె జెట్ లు యుద్ద నౌక నుండి పని చేస్తాయి.
కాగా విక్రాంత్ నిర్మాణంలో భారత దేశం యుకె, యుఎస్, రష్యా, చైనా, ఫ్రాన్స్ వంటి ఎంపిక చేసిన దేశాల సమూహంలో చేరింది.
Also Read : రాజధాని ఎక్స్ ప్రెస్’ విందు పసందు – ఇమ్నా