Abhishek Banerjee : కూల్చే పనిలో కేంద్రం ఫుల్ బిజీ – టీఎంసీ
నిప్పులు చెరిగిన ఎంపీ అభిషేక్ బెనర్జీ
Abhishek Banerjee : కేంద్రం అనుసరిస్తున్న వైఖరిని తీవ్రంగా తప్పు పట్టారు టీఎంసీ ప్రధాన కార్యదర్శి, టీఎంసీ ఎంపీ, మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ. ఒకే దేశం ఒకే పార్టీ ఒకే మతం ఉండాలనే లక్ష్యంతో కేంద్రంలో కొలువు తీరిన మోదీ ప్రభుత్వం యత్నిస్తోందంటూ ఆరోపించారు.
దేశంలో బీజేపీ పవర్ లో లేని రాష్ట్రాలను టార్గెట్ చేసిందంటూ ధ్వజమెత్తారు అభిషేక్ బెనర్జీ(Abhishek Banerjee). ప్రజా తీర్పుకు వ్యతిరేకంగా రాజ్యాంగ బద్దమైన విలువలకు తిలోదకాలు ఇచ్చి కూల్చడమే పనిగా పెట్టుకున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
జార్ఖండ్ లో ప్రజల మన్ననలు పొందలేని బీజేపీ అక్కడ జేఎంఎం ఆధ్వర్యంలో ఏర్పాటైన ప్రభుత్వాన్ని కూల్చేందుకు యత్నిస్తోందంటూ మండిపడ్డారు.
అయితే అక్కడ లాంటి ప్రయోగాలు పశ్చిమ బెంగాల్ లో కూడా చేయాలని ప్రయత్నాలు చేసిందని ఆరోపించారు. కానీ సీఎం మమతా బెనర్జీ మోదీ త్రయం, బీజేపీ చేస్తున్న కుట్రలను ముందే పసిగట్టిందని స్పష్టం చేశారు.
ఎన్ని ప్రయోగాలు చేసినా, కూల్చాలని యత్నించినా వారు విఫలం చెందారే తప్పా విజయం సాధించ లేదన్నారు. ప్రస్తుతం ఇక్కడ కూడా కేంద్ర దర్యాప్తు సంస్థల పేరుతో భయ పెట్టాలని చూస్తోందని మండిపడ్డారు.
తాము ఎలాంటి అవినీతి అక్రమాలకు పాల్పడలేదని నిర్భయంగా ఎన్ని కేసులైనా పెట్టుకోవచ్చన్నారు. తాము భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు ఎంపీ.
ఇదిలా ఉండగా బొగ్గు స్కాం కేసులో ఎంపీ శుక్రవారం కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ ముందు హాజరయ్యారు. తనను రాజకీయంగా ఎదుర్కోలేకే ఇలాంటి ప్రయోగాలు చేస్తోందన్నారు.
Also Read : కోవలంలో దక్షిణ జోనల్ కౌన్సిల్