Twitter Shock : ట్విట్టర్ షాక్ 45 వేల ఖాతాలు క్లోజ్
రూల్స్ ఉల్లంఘించారంటూ ఫైర్
Twitter Shock : ప్రపంచ సోషల్ మీడియా రంగంలో టాప్ సంస్థగా పేరొందింది మైక్రో బ్లాగింగ్ సంస్థ ట్విట్టర్(Twitter Shock). ఇప్పటికే పలు దేశాలు ట్విట్టర్ పై గుర్రు మంటున్నాయి.
అత్యధికంగా వాడుతున్నది భారతీయులే కావడం విశేషం. రోజు రోజుకు ఫేక్ ఖాతాలు సామాజిక మాధ్యమాలను విపరీతంగా ఇబ్బందులకు గురి చేస్తున్నాయి.
ఈ తరుణంలో ప్రతి సంస్థ స్వంతంగా నైపుణ్యం కలిగిన సీనియర్లను ఎంపిక చేసుకున్నాయి. ప్రత్యేకించి ప్రతి ఏటా కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నాయి. తెలుసుకుంటే కళ్లు బైర్లు కమ్మడం ఖాయం.
నిజమైన ఖాతాలు ఏవో నకిలీవి ఏవో తెలియకుండా పోతోంది. వీటిని గుర్తించేందుకు వేలాది మంది నిపుణులు అహరహం శ్రమిస్తున్నారు. మరో వైపు సోషల్ మీడియాను కట్టడి చేసేందుకు కేంద్రంలో కొలువు తీరిన మోదీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
ఈ మేరకు బిగ్ షాక్ కూడా ఇచ్చింది. గూగుల్ , ఫేస్ బుక్, లింక్డ్ ఇన్ , ఇన్ స్టా గ్రామ్ , ట్విట్టర్ , యూట్యూబ్ , తదితర వాటికి నోటీసులు కూడా ఇచ్చింది. ఈ మేరకు తమ ప్రభుత్వ రూల్స్ ను ఏ సంస్థ అయినా పాటించాల్సిందేనంటూ స్పష్టం చేసింది.
దీంతో ట్విట్టర్(Twitter Shock) , తదితర సంస్థలు కోర్టును ఆశ్రయించినా ఫలితం లేక పోయింది. ఇదిలా ఉండగా తాజాగా ట్విట్టర్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు భారత్ లో కొత్తగా 45 వేల ఖాతాలను నిషేధించినట్లు ప్రకటించింది.
ఈ విషయాన్ని తన అధికారిక ఖాతా ద్వారా వెల్లడించింది. మొత్తంగా ఇలాంటి నకిలీ ఖాతాలు ఉండడం, సరైన సమాచారం ఇవ్వక పోవడం, అభ్యంతరకర కంటెంట్ పోస్ట్ చేయడాన్ని సీరియస్ గా పరిగణలోకి తీసుకుంది.
Also Read : కావాలనే ట్విట్టర్ రూల్స్ ఉల్లంఘన