Siddaramaiah : మఠాధిపతి అరెస్ట్ పై సిద్దరామయ్య కామెంట్స్
నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలని డిమాండ్
Siddaramaiah : కర్ణాటకలో అత్యంత పేరొందిన చిత్రదుర్గ లోని మురగ మఠం మఠాధిపతి శివమూర్తి మురుగ అరెస్ట్ వ్యవహారం కలకలం రేపింది. ఆయన అరెస్ట్ తీవ్ర చర్చకు, రాజకీయ దుమారానికి తెర తీసింది.
ఇటీవలే మఠాధిపతిని కాంగ్రెస్ పార్టీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీతో పాటు మాజీ సీఎం సిద్దరామయ్య(Siddaramaiah), కేపీసీసీ చీఫ్ డీకే శివకుమార్ సందర్శించుకున్నారు.
ఇదే సమయంలో ఉన్నట్టుండి ఇద్దరు బాలికలు తమపై మఠాధిపతి గత కొంత కాలంగా రేప్ చేస్తూ వచ్చారని ఆరోపించారు. ఆపై వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.
ఫోక్సో చట్టం కింద గురువారం రాత్రి అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య అరెస్ట్ చేశారు. కోర్టులో హాజరు పర్చగా కస్టడీకి తరలించారు. దీనిపై సీరియస్ గా స్పందించారు కర్ణాటక మాజీ సీఎం సిద్దరామయ్య.
మైనర్ బాలికలపై లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న మురుగ మఠం మఠాధిపతి కేసు విషయంలో నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
అసలు వాస్తవాలను వెలికి తీయాలని కోరారు. శుక్రవారం ట్విట్టర్ వేదికగా మాజీ సీఎం స్పందించారు. ఇదిలా ఉండగా తనకు ఛాతి నొప్పి వస్తోందంటూ ఫిర్యాదు చేయడంతో మఠాధిపతిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
ప్రస్తుతం ఆరోపణలు ఎదుర్కొంటున్న మఠాధిపతి వయస్సు 64 ఏళ్లు. రాజకీయంగా అత్యంత ప్రభావితం కలిగిన మఠాధిపతిగా గుర్తింపు పొందారు శివమూర్తి.
Also Read : మురుగ మఠాధిపతికి 4 రోజుల కస్టడీ