Varun Gandhi : నిరుద్యోగం ఎన్నాళ్లీ మోసం – వరుణ్ గాంధీ
మోదీ బీజేపీ సర్కార్ పై షాకింగ్ కామెంట్స్
Varun Gandhi : భారతీయ జనతా పార్టీకి చెందిన ఎంపీ వరుణ్ గాంధీ మరోసారి నిప్పులు చెరిగారు. ఆయన మోదీ సర్కార్ కు(PM Modi) చుక్కలు చూపిస్తున్నారు. ఆయన పదే పదే దేశంలో పెరుగుతున్న ద్రవ్యోల్బణం, నిరుద్యోగిత రేటును ప్రస్తావిస్తున్నారు.
కేంద్రం ఎందుకు శ్రద్ద పెట్టడం లేదంటూ ప్రశ్నించారు. రోజు రోజుకు నిరుద్యోగం పెరుగుతున్నా పట్టించుకోక పోవడం దారుణమన్నారు ఎంపీ. ఏకంగా 8.3 శాతం నిరుద్యోగిత రేటు నమోదు కావడం మోదీ పాలనకు, పనితీరుకు నిదర్శనమని ఎద్దేవా చేశారు.
జూలై నెలలో 6.8 శాతంగాఉన్న నిరుద్యోగిత రేటు ఒక్క ఆగస్టు వరకు వచ్చేసరికి ఏకంగా 8.3 కి పెరగడం మరింత ఆందోళన కలిగిస్తోందన్నారు వరుణ్ గాంధీ.
గత నెలలో ఏకంగా దేశ వ్యాప్తంగా 20 లక్షల మంది ఉపాధి కోల్పోవడం తనను ఎంతో ఆవేదనకు గురయ్యేలా చేసిందని వాపోయారు.
ఈ సంఖ్యలు, అంకెలు , వివరణలు తాను చెప్పడం లేదని కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (సీఎంఐఈ) తయారు చేసిన నివేదికలో పేర్కొన్నవేనని స్పష్టం చేశారు వరుణ్ గాంధీ(Varun Gandhi).
పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగిత రేటు 9.6 శాతానికి పెరగగా పల్లె ప్రాంతాలలో కూడా 7.7 శాతానికి పెరగడం దారుణమన్నారు వరుణ్ గాంధీ.
ఇకనైనా మోదీ నిద్ర నుంచి మేల్కోవాలని ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాల మాటేమిటో కానీ ఉన్న కొలువులు ఊడిపోకుండా చూడాలని సూచించారు బీజేపీ ఎంపీ.
సీఎంఐఈ తాజా నివేదికను ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. యువకుల్లో ఉద్యోగిత రేటు ఐదేళ్ల కనిష్టానికి చేరిందని ట్విట్టర్ వేదికగా గుర్తు చేశారు ఎంపీ.
Also Read : కూల్చే పనిలో కేంద్రం ఫుల్ బిజీ – టీఎంసీ