Joe Biden : ప్రభుత్వాన్ని కూల్చేందుకు ట్రంప్ కుట్ర
కూల్చేందుకు కుట్రలంటూ ఆరోపణ
Joe Biden : అమెరికా దేశ అధ్యక్షుడు జోసెఫ్ బైడెన్ షాకింగ్ కామెంట్స్ చేశారు. మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ను టార్గట్ చేశారు. ఆయనపై నిప్పులు చెరిగారు.
ఆయన పూర్తిగా రాచరికపు ఆలోచనలతో ఉన్నారని ఎప్పటికీ మంచి పద్దతి కాదని సూచించారు. ప్రపంచంలో అత్యున్నతమైన ప్రజాస్వామ్యానికి ప్రతీకగా ఇప్పటికీ అమెరికా గుర్తించ బడుతోందన్నారు.
కానీ డెమోక్రసీని తుంగలో తొక్కేందుకు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) , ఆయన మద్దతుదారులు ప్రతిక్షణం ప్రతి రోజూ ప్రయత్నం చేస్తూనే ఉన్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు.
దీనిని తాము ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోమంటూ హెచ్చరించారు. రాజకీయంగా ఎదుర్కోలేక ఇలాంటి తప్పుడు పద్దతులను ఎంచు కోవడం ప్రజాస్వామ్యానికి ముఖ్యంగా డొనాల్డ్ ట్రంప్ కు మంచిది కాదని పేర్కొన్నారు జోసెఫ్ బైడెన్(Joe Biden).
ఇప్పటికే ఆయన చేసిన నిర్వాకం అమెరికాకు మాయని మచ్చగా మిగిల్చిందని మరోసారి అక్రమ పద్దతుల్లో అధికారాన్ని చేజిక్కించు కోవాలని అనుకుంటున్నారని కానీ తాను ఉన్నంత వరకు సాగదన్నారు ప్రెసిడెంట్ బైడెన్.
కేవలం హింసను మాత్రమే నమ్ముకున్న వారికి భవిష్యత్తు అంటూ ఉండదన్నారు. డొనాల్డ్ ట్రంప్, ఆయన మద్దతు దారుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని బైడెన్ హెచ్చరించారు.
ఫిలడెల్ఫియాలోని ఇండిపెండెన్స్ హాల్ లో దేశ అధ్యక్షుడు ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రజలు అప్రమత్తంగా ఉంటూనే దేశాన్ని తీవ్ర భయాందోళనకు గురి చేస్తూ వస్తున్న ఉగ్రవాదం పట్ల జాగ్రత్తగా ఉండాలన్నారు.
రాజకీయ హింసను ఎగదోస్తున్న వారికి గట్టి బుద్ది చెప్పాలని పిలుపునిచ్చారు జో బైడెన్. ప్రజాస్వామ్య వ్యతిరేక శక్తులకు తగిన రీతిలో గుణపాఠం నేర్పాలని కోరారు.
Also Read : బ్రిటన్ పీఎం రేసులో లిజ్ ట్రస్ ముందంజ