Jharkand Crisis : జార్ఖండ్ బీజేపీ ఎంపీల‌పై కేసు

రాష్ట్రంలో నెల‌కొన్న సంక్షోభం

Jharkand Crisis : జార్ఖండ్ రాష్ట్రంలో రాజ‌కీయ సంక్షోభం కొన‌సాగుతూనే ఉంది. జేఎంఎం సంకీర్ణ స‌ర్కార్ ప్ర‌స్తుతం తీవ్ర ఇక్క‌ట్ల‌ను ఎదుర్కొంటోంది. సీఎం గా కొలువు తీరిన హేమంత్ సోరేన్ కు కోలుకోలేని షాక్ త‌గిలింది.

కేంద్రంలోని బీజేపీ స‌ర్కార్ జార్ఖండ్ ను ప్ర‌భుత్వాన్ని కూల్చే ప‌నిలో ప‌డింది. ఈ త‌రుణంలో త‌నంత‌కు తానుగా మైన్స్ కేటాయించు కున్నారంటూ సీఎంపై భార‌తీయ జ‌న‌తా పార్టీ నేత‌లు ఆరోపణ‌లు చేశారు.

గ‌వ‌ర్న‌ర్ ఈ మేర‌కు కేంద్ర ఎన్నిక‌ల సంఘానికి లేఖ రాశారు. ఇందులో భాగంగా చ‌ర్య‌లు తీసుకునే అధికారం గ‌వ‌ర్న‌ర్ కు ఉంటుంద‌ని స్ప‌ష్టం చేసింది.

దీంతో హేమంత్ సోరేన్ శాస‌న‌స‌భ స‌భ్య‌త్వాన్ని ర‌ద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. త‌న ప్ర‌భుత్వానికి మూడింద‌ని ముందే గ్ర‌హించిన హేమంత్ సోరేన్(Hemanth Soren) త‌న ఎమ్మెల్యేల‌తో క‌లిసి మొద‌ట గెస్ట్ హౌస్ కు త‌ర‌లించారు.

జేఎంఎం, కాంగ్రెస్ ఎమ్మెల్యేల‌కు కోట్ల రూపాయ‌లు బీజేపీ ఆఫర్ ఇస్తుండ‌డంతో ప్ర‌భుత్వం కూలి పోయే ప్ర‌మాదం ఉందంటూ గ్ర‌హించారు.

తాజాగా బీజేపీ వ‌ర్సెస్ జార్ఖండ్(Jharkand Crisis) ప్ర‌భుత్వాల మ‌ధ్య మాట‌ల యుద్దం, కేసుల ప‌ర్వం కొన‌సాగుతోంది. ఈ త‌రుణంలో ఆస‌క్తి ప‌రిణామాలు చోటు చేసుకుంటున్నాయి. భార‌తీయ జ‌న‌తా పార్టీకి చెందిన జార్ఖండ్ ఎంపీల‌పై అక్ర‌మాస్తుల కేసు న‌మోదు చేయ‌డం క‌ల‌క‌లం రేపింది.

ఎంపీలు నిషికాంత్ దూబే , మ‌నోజ్ తివారీ , మ‌రో ఏడుగురిపై అక్ర‌మాస్తుల కేసులో అభియోగాలు మోపారు. ఆగ‌స్టు 31న దూబే అత‌ని కుమారులు, తివారీతో పాటు ఇత‌రులు హై సెక్యూరిటీ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ) ప్రాంతంలోకి ప్ర‌వేశించారు.

త‌మ చార్ట‌ర్డ్ విమానాన్ని టేకాఫ్ కోసం క్లియ‌ర్ చేమంటూ అధికారుల‌ను బ‌ల‌వంతం చేశారంటూ కేసు న‌మోదు చేశారు.

Also Read : జేడీయూ ఎమ్మెల్యేలు బీజేపీలోకి జంప్

Leave A Reply

Your Email Id will not be published!