Kavitha Krishnan : కవితా కృష్ణన్ షాకింగ్ నిర్ణయం
రష్యా, చైనాలపై ప్రశ్నల వర్షం
Kavitha Krishnan : సీపీఐ ఎంఎల్ లిబరేషన్ కు చెందిన ప్రముఖ నాయకురాళ్లలో ఒకరిగా గుర్తింపు పొందిన కవితా కృష్ణన్ షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. రష్యా, చైనా గురించి సమస్యాత్మక ప్రశ్నలను ఎత్తి చూపారు.
పార్టీ పదవులు అన్నింటిని వదులుకుంటున్నట్లు ప్రకటించారు. కవితా కృష్ణన్(Kavitha Krishnan) పొలిట్ బ్యూరో సభ్యురాలు. ఇదిలా ఉండగా రెండు దశాబ్ధాలకు పైగా కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్ లెనినిస్ట్ ) లిబరేషన్ లో సెంట్రల్ కమిటీ మెంబర్ గా ఉన్నారు.
ఈ సందర్భంగా ఫేస్ బుక్ లో ఆమె కీలక వ్యాఖ్యలు చేసింది. భారత దేశంలో ఫాసిజం, పెరుగుతున్న నిరంకుశత్వానికి వ్యతిరేకంగా ప్రజాస్వామ్యం కోసం పోరాటం స్థిరంగా ఉండాలంటే , గత , ప్రస్తుత సోషలిస్టు నిరంకుశ పాలనలోని అంశాలతో సహా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రజలందరికీ ఒకే విధమైన హక్కులు ఉండాలన్నారు.
అంతే కాకుండా పౌర స్వేచ్ఛలను పొందే అర్హతను మనం గుర్తించాలని పేర్కొన్నారు కవితా కృష్ణన్. ఆమె టీవీ, ట్విట్టర్ లో ప్రముఖ వ్యాఖ్యతగా ఉ న్నారు.
అంతే కాకుండా సోషల్ మీడియాలో తన అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ వస్తున్నారు. పార్టీ పదవులను కలిగి ఉంటే తాను చేయలేని ప్రశ్నలను తన రచనల ద్వారా లేవనెత్తుతూనే ఉంటానని ప్రకటించారు కవితా కృష్ణన్(Kavitha Krishnan).
స్టాలిన్ ఆధ్వర్యంలో యుఎస్ఎస్ఆర్ పారిశ్రామికీకరణ ఉక్రెయిన్ రైతులను హింసాత్మకంగా లొంగ దీసుకోవడంతో జరిగిందని ఆరోపించారు.
కమ్యూనిస్టులు ఇలా పాలించడం సరికాదని భారతీయ కమ్యూనిస్టు ఎవరైనా భావిస్తే వారు భారత దేశంలో ఎలాంటి ప్రజాస్వామ్యం కోసం పోరాడుతున్నారో తమను తాము ప్రశ్నించు కోవాలని చైనాలో పౌరుల నిఘా గురించి రాసింది.
Also Read : కోవలంలో దక్షిణ జోనల్ కౌన్సిల్