KTR & Nirmala Sitharaman : నిర్మలా సీతారామన్ పై కేటీఆర్ ఫైర్
కేంద్ర మంత్రి నిర్వాకంపై మంత్రి ఆగ్రహం
KTR & Nirmala Sitharaman : కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్(KTR & Nirmala Sitharaman) పై నిప్పులు చెరిగారు తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్. ఆమె స్థాయికి మించి మాట్లాడుతోందంటూ మండిపడ్డారు.
కలెక్టర్ పట్ల కేంద్ర మంత్రి వ్యవహరించిన తీరు దారుణమని పేర్కొన్నారు. ఒక రకంగా ఆమెపై సీరియస్ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం మంత్రి చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి.
కామారెడ్డి జిల్లా కలెక్టర్ పట్ల ఇలాగేనా వ్యవహరించేది అంటూ నిలదీశారు. కేంద్ర స్థాయిలో ఉన్న మంత్రికి ఇతరుల పట్ల ముఖ్యంగా ఐఏఎస్ అధికారుల పట్ల ఎలా మాట్లాడాలో తెలియక పోవడం విడ్డూరంగా ఉందన్నారు కేటీఆర్.
ఆమె వికృతంగా ప్రవర్తించిందంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సమాధానం చెప్పలేని కలెక్టర్ ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మందించడం రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది.
దేశ వ్యాప్తంగా చర్చకు దారితీసింది. సరసమైన ధరల దుకాణాల ద్వారా సరఫరా చేస్తున్న బియ్యంలో కేంద్రం, రాష్ట్ర వాటా ఎంత అన్నదానికి సమాధానం చెప్పలేని కలెక్టర్ ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మందలించారు.
సీరియస్ అయ్యారు. 30 నిమిషాలు టైమ్ ఇస్తున్నానని అప్పటి లోగా తెలుసుకుని తనకు సమాధానం చెప్పాలని స్పష్టం చేశారు. ఉన్నత పదవుల్లో ఉన్న వ్యక్తుల పట్ల ఇలాంటి ప్రవర్తన పని చేసే వారి పట్ల మాట్లాడటాన్ని తీవ్రంగా తప్పుపట్టారు.
కేంద్ర మంత్రి మాట్లాడిన మాటలకు ఎలాంటి సమాధానం చెప్పకుండా గౌరవ ప్రదంగా రిశీవ్ చేసుకున్నందుకు ప్రత్యేకంగా అభినందిస్తున్నట్లు కేటీఆర్ తెలిపారు.
Also Read : తెలంగాణపై కేంద్ర సర్కార్ వివక్ష