Raghav Chadha : రాష్ట్రపతిని కలిసిన రాఘవ్ చద్దా
పలు అంశాల గురించి ప్రస్తావన
Raghav Chadha : ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ, పంజాబ్ ప్రభుత్వ సలహాదారు రాఘవ్ చద్దా శనివారం భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్మును(Draupadi Murmu) మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు.
ఈ సందర్బంగా కీలక అంశాల గురించి చర్చించారు. ఆప్ ఎంపీ రాష్ట్రపతిని కలవడం రాజకీయ వర్గాలలో కలకలం రేపింది. కేంద్రంలో కొలువు తీరిన భారతీయ జనతా పార్టీకి ఢిల్లీలో ఏర్పాటైన ఆప్ ప్రభుత్వానికి మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనేలా మారింది.
ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకుంటూ రాజకీయాన్ని మరింత రక్తి కట్టిస్తున్నారు. ఇదిలా ఉండగా రాష్ట్రపతిని కలిసి పరామర్శించిన సందర్భంగా రాఘవ్ చద్దా అమృత్ సర్ లోని గోల్డెన్ టెంపుల్ ప్రతి రూపాన్ని ముర్ముకు బహూకరించారు.
ఇందుకు సంబంధించిన ఫోటోను ట్విట్టర్ లో స్వయంగా పోస్ట్ చేశారు రాఘవ్ చద్దా. ఆదివాసీ వర్గానికి చెందిన వ్యక్తి ద్రౌపది ముర్ము. ఆమె దేశానికి రెండో ఆదివాసీ మహిళ రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు.
ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన రాష్ట్రపతిని కలుసు కోవడం, పరామర్శించడం చాలా ఆనందంగా ఉందని పేర్కొన్నారు ఎంపీ రాఘవ్ చద్దా(Raghav Chadha).
నా పరంగా, పార్టీ పరంగా శుభాకాంక్షలు తెలియ చేశా. ఇదే సమయంలో పవిత్ర పుణ్య స్థలంగా భావించే అమృత్ సర్ లోని గోల్డెన్ టెంపుల్ ప్రతిమను బహూకరించాను.
అంతే కాకుండా ఈ పవిత్ర స్థలాన్ని సందర్శించాలని కోరానని పేర్కొన్నారు రాఘవ్ చద్దా. ఎలాంటి రాజకీయ అంశాలు చర్చకు రాలేదని స్పష్టం చేశారు ఆప్ ఎంపీ.
కాగా తనకు గోల్డెన్ టెంపు ప్రతిమను బహూకరించినందుకు ఎంపీని ప్రత్యేకంగా అభినందించారు రాష్ట్రపతి ముర్ము.
Also Read : మఠం అవార్డు నాకొద్దు – సాయినాథ్