Kiren Rijiju : కేంద్ర మంత్రి రిజిజు షాకింగ్ కామెంట్స్

మాజీ ఎస్సీ జ‌డ్జి వ్యాఖ్య‌ల‌పై స్పంద‌న

Kiren Rijiju : దేశ వ్యాప్తంగా చ‌ర్చ‌కు దారి తీసింది గుజ‌రాత్ కు చెందిన సామూహిక అత్యాచారం, హ‌త్య‌కు సంబంధించిన కేసులో విడుద‌లైన 11 మంది దోషుల గురించి. యావ‌త్ దేశం గుజ‌రాత్ ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యాన్ని త‌ప్పు ప‌డుతోంది.

పెద్ద ఎత్తున ఆందోళ‌న‌లు, నిర‌స‌న‌లు వ్య‌క్తం అవుతున్నాయి. కేసుకు సంబంధించి తీర్పు చెప్పిన మాజీ హైకోర్టు న్యాయ‌మూర్తి యూడీ సాల్వే విస్తు పోయారు. విస్మ‌యాన్ని వ్య‌క్తం చేశారు.

బీజేపీకి చెందిన మ‌రాఠా డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫ‌డ్న‌వీస్ , త‌మిళ‌నాడు న‌టి, నాయ‌కురాలు ఖుష్బూ సుంద‌ర్ దోషుల విడుద‌ల‌, వారికి స‌న్మానం చేయ‌డాన్ని తీవ్రంగా త‌ప్పు ప‌ట్టారు.

ఇదే క్ర‌మంలో సుప్రీంకోర్టు రిటైర్డ్ జ‌డ్జి జ‌స్టిస్ బీఎన్ శ్రీ‌కృష్ణ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. చ‌ట్టం, పాల‌న విష‌యాల‌పై త‌మ వ్య‌క్తిగ‌త అభిప్రాయాల‌ను వ్య‌క్తీక‌రించేందుకు పౌర సేవ‌కుల స్వేచ్ఛ గురించి మాట్లాడారు.

జ‌స్టిస్ బీఎన్ లేవ‌నెత్తిన ఆందోళ‌న‌పై స్పందించారు కేంద్ర న్యాయ శాఖ మంత్రి రిజిజు(Kiren Rijiju). దేశంలో భావ ప్ర‌క‌ట‌నా స్వేచ్ఛ పేరుతో అన‌వ‌స‌ర ఆందోళ‌న‌, ఆరోప‌ణ‌లు చేస్తున్నారంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

ప్ర‌త్యేకించి ప్రజాద‌ర‌ణ పొందిన ప్ర‌ధాన మంత్రిపై అవాకులు చెవాకులు పేలుతున్నారంటూ ఇదేనా స్వేచ్ఛ అంటే అని ప్ర‌శ్నించారు కేంద్ర మంత్రి.

ప్ర‌ధాన మంత్రి ముఖం నాకు ఇష్టం లేద‌ని చెబితే వెంట‌నే నేను జైలులో ఉండాల్సిన ప‌రిస్థితి నెల‌కొంద‌న్నారు మాజీ జ‌డ్జి. ప్ర‌స్తుతం ఆయ‌న చేసిన కామెంట్స క‌ల‌క‌లం రేపుతున్నాయి. ఇప్పుడు పౌరులుగా మ‌నమంద‌రం వ్య‌తిరేకించాల్సిన విష‌యమ‌ని పేర్కొన్నారు.

Also Read : రాష్ట్ర‌ప‌తిని క‌లిసిన రాఘ‌వ్ చ‌ద్దా

Leave A Reply

Your Email Id will not be published!