Gotabaya Rajapaksa : రాజాపక్సేకు దాక్కునేందుకు చోటు లేదు
అరెస్ట్ వారెంట్ ఎదుర్కొన్న మాజీ చీఫ్
Gotabaya Rajapaksa : శ్రీలంక దేశాన్ని సర్వ నాశనం చేసి ప్రజాగ్రహానికి గురై పారి పోయిన మాజీ అధ్యక్షుడు గోటబయ రాజపక్సే(Gotabaya Rajapaksa) తిరిగి రావడం ప్రస్తుతం చర్చకు దారి తీసింది. అరెస్ట్ కాల్ లను ఎదుర్కొంటున్నారు.
73 ఏళ్ల వయస్సు ఉన్న ఆయన తిరిగి వచ్చేందుకు నానా తంటాలు పడ్డారు. బ్యాంకాక్ హోటల్ లో ఉన్నారు. ఆయన తిరిగి వచ్చేందుకు తన వారసుడిని లాబీయింగ్ చేశాడు.
రాజపక్సే తన ప్రభుత్వానికి వ్యతిరేకంగా నెలల తరబడి ఆగ్రహంతో కూడిన ప్రదర్శనల తర్వాత అతని అధికారిక నివాసంపై భారీ గుంపు దాడి చేయడంతో జూలైలో సైనిక ఎస్కార్ట్ తో పారి పోయాడు.
ఇదిలా ఉండగా తన ప్రభుత్వాన్ని కూల్చి వేసిన నిరసన ప్రచారంలో పాల్గొన్న నాయకులు తీవ్రంగా తప్పు పట్టారు. తన అధ్యక్ష పదవిని కోల్పోయిన రాజపక్సేను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.
ఏ దేశం ఆయనను అంగీకరించదు. చివరకు గోటబయ రాజపక్సే తిరిగి శ్రీలంకకు వచ్చాడని మండిపడ్డారు. అతడు దాచుకునేందుకు ఎక్కడా స్థలం లేదన్నారు ఉపాధ్యాయుల కార్మిక సంఘం నాయకుడు జోసెఫ్ స్టాలిన్(Joseph Stalin).
శ్రీలంకలోని 22 మిలియన్ల ప్రజలకు ఇంతటి దుఖఃం కలిగించినందుకు వెంటనే అరెస్ట్ చేయాలన్నారు. ఆయన చేసిన నేరాలపై విచారణ జరిపించాలన్నారు.
శ్రీలంక దేశాన్ని(Srilanka Crisis) సర్వనాశనం చేశారంటూ మండిపడ్డారు. ఆర్థికంగా, రాజకీయంగా, అన్ని రంగాలలో దేశాన్ని ఇబ్బందుల్లోకి నెట్టిన ఘనమైన చరిత్ర గోటబయ రాజపక్సేకు ఉందన్నారు.
అతను ఏమీ జరగనట్లు స్వేచ్ఛగా జీవించే పరిస్థితి లేదన్నారు స్టాలిన్. కాగా రాజపక్సే సోదరుడు మాజీ ఆర్థిక మంత్రి బాసిల్ గత నెలలో విక్రమసింఘెతో సమావేశమై గోటబయకు రక్షణ కల్పించాలని కోరాడు.
తమిళ ఖైదీలను చిత్రహింసలకు గురి చేసినందుకు రాజపక్సే యుఎస్ కోర్టులో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
Also Read : ద్వీప దేశంలో కాలు మోపిన రాజపక్సే