CJI UU Lalit : రికార్డు స్థాయిలో కేసుల ప‌రిష్కారం

నాలుగు రోజుల వ్య‌వ‌ధిలోనే విముక్తి

CJI UU Lalit : భార‌త దేశ స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానం సుప్రీంకోర్టు అరుదైన ఘ‌న‌త సాధించింది. జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ ప‌ద‌వీ విర‌మ‌ణ పొందిన అనంత‌రం 49వ సీజేఐగా కొలువు తీరిన జ‌స్టిస్ యుయు ల‌లిత్(CJI UU Lalit) ఆధ్వ‌ర్యంలో రికార్డు స్థాయిలో కేసులు ప‌రిష్కారం అయ్యాయి.

ఒక ర‌కంగా ఇది అరుదైన ఘ‌న‌త‌గా పేర్కొన‌వ‌చ్చు. ఒక‌టి కాదు రెండు కాదు ఏకంగా కేవ‌లం 4 రోజుల వ్య‌వ‌ధిలో ల‌క్షా 80 వేల కేసుల‌ను ప‌రిష్క‌రించారు.

మ‌రో వైపు త‌న ప‌ద‌వీ కాలం కేవ‌లం 74 రోజులు మాత్రమే. మూడు అంశాల‌పై తాను ఎక్కువ‌గా ఫోక‌స్ పెడ‌తాన‌ని స్ప‌ష్టం చేశారు. అప‌రిష్కృతంగా ఉన్న కేసుల ప‌రిష్కారంపైనే దృష్టి సారిస్తాన‌ని తెలిపారు.

ఆ మేర‌కు ఆయ‌న స‌క్సెస్ అయ్యార‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. 1,800కు పైగా కేసుల‌ను ప‌రిష్క‌రించింది. న్యాయ‌స్థానం ప్ర‌తిరోజూ గ‌రిష్టంగా సాధ్య‌మయ్యే కేసుల సంఖ్య‌ను విచారించ‌గ‌ల‌దు,

నిర్ణ‌యించ గ‌ల‌ద‌ని పేర్కొన్నారు సీజేఐ యుయు ల‌లిత్(CJI UU Lalit). ఇటీవ‌ల బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిర్వ‌హించిన స‌త్కార కార్య‌క్ర‌మంలో యుయు ల‌లిత్ మాట్లాడారు.

మొద‌టి వారంలోనే త‌న ప‌నితీరు గురించి ముందుగానే స్ప‌ష్టం చేశారు. గ‌త నాలుగు రోజుల్లో జ‌రిగిన ఒక విష‌యాన్ని మీతో పంచుకోవాల‌ని అనుకుంటున్నా.

చాలా ఎక్కువ సంఖ్య‌లో పేరుకు పోయిన కేసుల‌ను ప‌రిష్క‌రించేందుకు కృషి చేస్తున్న‌ట్లు తెలిపారు. దానికే ప్ర‌యారిటీ ఇస్తున్న‌ట్లు స్ప‌ష్టం చేశారు సీజేఐ. ఇత‌ర కేసుల‌కు సంబంధించి 1,293 కేసుల‌ను ప‌రిష్క‌రించామ‌న్నారు.

Also Read : కేంద్ర మంత్రి రిజిజు షాకింగ్ కామెంట్స్

Leave A Reply

Your Email Id will not be published!