Arvind Kejrwal : ఆప్ కు అందలం కాషాయానికి మంగళం
24 ఏళ్ల బీజేపీ పాలన ఏం చేసిందో చెప్పాలి
Arvind Kejrwal : గుజరాత్ లో రాజకీయం మరింత వేడెక్కింది. ఇప్పటికే ఢిల్లీ తో పాటు పంజాబ్ లో పాగా వేసిన ఆమ్ ఆద్మీ పార్టీ ప్రస్తుతం గుజరాత్ పై ఫోకస్ పెట్టింది.
ఇక్కడ భారతీయ జనతా పార్టీకి తామే అసలైన ప్రత్యామ్నాయం అంటూ స్పష్టం చేశారు ఆప్ చీఫ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejrwal). రాష్ట్రంలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా సరే ఆప్ పాగా వేయాలని చూస్తోంది.
ఇందులో భాగంగా కేజ్రీవాల్ అంతా తానై పర్యటిస్తున్నారు. పలు మార్లు గుజరాత్ లో పర్యటిస్తూనే బీజేపీని , కేంద్రాన్ని, మోదీని టార్గెట్ చేస్తూ వచ్చారు. తాము పవర్ లోకి వస్తే విద్య, వైద్యం, ఉపాధి కి ప్రయారిటీ ఇస్తామని ప్రకటించారు.
మరో వైపు ఒక్కసారి తమకు ఛాన్స్ ఇవ్వాలంటూ కోరుతున్నారు. తాజాగా సూరత్ లో తాము సత్తా చాటడం ఖాయమన్నారు అరవింద్ కేజ్రీవాల్. ప్రజలు మార్పును కోరుతున్నారని ఇందులో ఎలాంటి సందేహం లేదన్నారు.
ఉన్న 12 సీట్లలో 7 సీట్లు తప్పక గెలుచుకుని తీరుతామంటూ కుండబద్దలు కొట్టారు. తమకు లభిస్తున్న జనాదరణను చూసి తట్టుకోలేక ఆప్ నాయకులపై బీజేపీ నేతలు దాడులకు పాల్పడుతోందంటూ ధ్వజమెత్తారు.
ఇదేనా మీ సంస్కృతి అంటూ నిప్పులు చెరిగారు. జాతీయ వాదం పేరుతో రాజకీయాలు చేస్తున్న బీజేపీకి తగిన రీతిలో బుద్ది చెప్పడం ఖాయమన్నారు.
తమకు ఏ పార్టీ పోటీ కాదని కానీ కాషాయానికి తామే అసలైన ప్రత్యామ్నాయం అంటూ స్పష్టం చేశారు ఆప్ చీఫ్ , సీఎం అరవింద్ కేజ్రీవాల్.
Also Read : రికార్డు స్థాయిలో కేసుల పరిష్కారం