Bombay HC Notice : సీరమ్..బిల్ గేట్స్ కు నోటీసులు
వాక్సిన్ మరణాలపై హైకోర్టు
Bombay HC Notice : కరోనా మహమ్మారి నివారణ కోసం ఉపయోగించిన వ్యాక్సిన్ వల్లనే తన కూతురు చని పోయిందంటూ బాధితురాలి తండ్రి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు తనకు నష్ట పరిహారం ఇవ్వాలంటూ కోర్టును ఆశ్రయించారు.
ముంబైకి చెందిన కోవీషీల్డ్ నుంచి వచ్చిన దుష్ప్రభావాల కారణంగానే తన కూతురు ప్రాణాలు కోల్పోయిందంటూ దావాలో పేర్కొన్నారు. వ్యాక్సిన్ తయారీ దారు నుండి రూ. 1,000 కోట్ల పరిహారం ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు.
ప్రపంచంలోనే అతి పెద్ద వ్యాక్సిన్ తయారీదారు గా పేరొందారు సీరమ్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండియా. కోవీ షీల్డ్ ను కరోనా వైరస్ వ్యాధికి నివారణకు గాను టీకాను తయారుచేసింది.
కేసును పరిగణలోకి తీసుకున్న బాంబే హైకోర్టు సీరమ్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండియా , మైక్రోసాఫ్ట్ ఫౌండర్ బిల్ గేట్స్ , ఇతరుల నుండి ప్రతిస్పందనను కోరింది. వీరందరికీ నోటీసులు(Bombay HC Notice) జారీ చేసింది.
ప్రత్యేకించి వ్యాక్సిన్ తయారీదారు నుండి ఈ భారీ పరిహారం కోరడం దేశ వ్యాప్తంగా కలకలం రేపింది. ఔరంగాబాద్ కు చెందిన పిటిషనర్ దిలీప్ లున్ వత్. తన కూతురు స్నేహల్ లునావత్ వైద్య విద్యార్థినిగా ఉన్నారు.
గత ఏడాది జనవరి 28న నాసిక్ లోని తన కాలేజీలో ఆరోగ్య విభాగంలోకి వచ్చింది. యాంటీ కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవాల్సి వచ్చిందని పేర్కొన్నారు.
కొన్ని రోజుల తర్వాత ఆమెకు తీవ్రమైన తలనొప్పి, వాంతులు వచ్చాయి. ఆస్పత్రికి తరలించారు. మెదడు స్తంభించి పోయింది. దీనికంతటికి కారణం వ్యాక్సిన్ అంటూ ఆరోపించారు.
Also Read : రికార్డు స్థాయిలో కేసుల పరిష్కారం