P Chidambaram : తీస్తా సెతల్వాద్ పోరాట యోధురాలు
ప్రశంసలతో ముంచెత్తిన పి.చిదంబరం
P Chidambaram : 2002లో చోటు చేసుకున్న గుజరాత్ అల్లర్ల కేసుకు సంబంధించి అరెస్ట్ చేసిన తీస్తా సెతల్వాద్ కు బెయిల్ మంజూరు చేసింది సుప్రీంకోర్టు. ఈ సందర్భంగా కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు పి. చిదంబరం(P Chidambaram) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
స్వాతంత్రానకి స్వాగతం. న్యాయం కోసం సాహసోపేతమైన పోరాట యోధురాలు తస్తా సెతల్వాద్ అంటూ కితాబు ఇచ్చారు. ఆమె ముందు నుంచి ప్రజల హక్కుల కోసం పోరాడింది.
ధైర్యంగా నిలబడింది. ఇంకా పోరాడుతూనే ఉంది. ఒక రకంగా ఏకపక్షంగా సాగుతున్న ఈ ప్రభుత్వ ధోరణికి ఇది ఓ చెంప పెట్టు లాంటింది.
మోదీ ప్రభుత్వం(PM Modi Govt) కొలువు తీరిన తర్వాత చోటు చేసుకున్న పరిణామాలన్నీ ప్రజా వ్యతిరేకంగానే ఉన్నాయి. జాతి పేరుతో, మతం పేరుతో, కులం పేరుతో, ప్రాంతాల పేరుతో విభజిస్తూ వస్తున్నారు.
దీనిని ఎవరూ హర్షించరు. ఎవరూ ఒప్పుకోరు కూడా. ఇదిలా ఉండగా సెప్టెంబర్ 2న హక్కుల కార్యకర్త తీస్తా సెతల్వాద్ కు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడం ప్రజాస్వామ్యం ఇంకా బతికే ఉందన్నది అర్థమైందని పి. చిదంబరం.
భారత సర్వోన్నత ప్రధాన న్యాయస్థానంకు ఈ సందర్భంగా తాను కృతజ్ఞతలు తెలియ చేసుకుంటున్నానని పేర్కొన్నారు కేంద్ర మాజీ మంత్రి.
ఇదే సమయంలో ఇంకొకరు గనుక ఉండి ఉంటే తల వంచే వారని కానీ తీస్తా సెతల్వాద్ ఎక్కడా తల వంచిన దాఖలాలు లేవేన్నారు. ఇలాంటి వారే దేశానికి కావాలని ఆకాంక్షించారు.
Also Read : కర్ణాటక బ్రాండ్ అంబాసిడర్ గా సుదీప్