Donald Trump : జో బైడెన్ అమెరికాకు శాపం – ట్రంప్
నిప్పులు చెరిగిన మాజీ అధ్యక్షుడు
Donald Trump : తనపై ఆరోపణలు చేసిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పై నిప్పులు చెరిగారు మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. బైడన్ అమెరికాకు శాపంగా మారారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఇదిలా ఉండగా హింసను ఆధారంగా చేసుకుని దేశంలో అల్లకల్లోలం సృష్టించేందుకు ట్రంప్ తో పాటు ఆయన మద్దతుదారులు యత్నిస్తున్నారంటూ ఆరోపించారు బైడెన్.
దీనికి సీరియస్ గా కౌంటర్ ఇచ్చారు ట్రంప్. అమెరికా చీఫ్ చేసిన అత్యంత దుర్మార్గపు, ద్వేష పూరిత , విభజన ప్రసంగం చేశారంటూ మండిపడ్డారు. దేశానికి అధ్యక్ష స్థానంలో ఉన్న జో బైడెన్ ఇలా బాధ్యతా రాహిత్యంగా మాట్లాడటం మంచి పద్దతి కాదన్నారు.
ఒక రకంగా తన స్థాయికి దిగజారి మాట్లాడారంటూ మండిపడ్డారు డొనాల్డ్ ట్రంప్(Donald Trump). తాము ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఇప్పటి వరకు ప్రయత్నం చేస్తూ వస్తున్నామని చెప్పారు.
ఇదే సమయంలో బైడెన్ దేశానికి శాపంగా మారారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిని ఆయన న్యాయంకు సంబంధించిన అపహాస్యంగా కొట్టి పారేశారు డొనాల్డ్ ట్రంప్.
ఆచరణకు నోచుకోని హామీలను గుప్పించిన బైడెన్ కు(Joe Biden) తాను ఓడి పోతామోనన్న భయం పట్టుకుందని ఎద్దేవా చేశారు. ఎన్ని కుట్రలు పన్నినా వేధింపులకు గురి చేసినా తమ వారు ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉన్నారని స్పష్టం చేశారు డొనాల్డ్ ట్రంప్.
వచ్చే ఎన్నికల్లో బైడెన్ దెబ్బ తినడం ఖాయమని ట్రంప్ జోష్యం చెప్పారు. అమెరికా స్వాతంత్రం నుండి నిజమైన బెదిరింపులకు స్పష్టమమైన ఉదాహరణ లేదన్నారు.
అమెరికా చరిత్రలో గతంలో ఎన్నడంతగా అధికార దుర్వినియోగం చోటు చేసుకుందని ఆరోపంచారు ట్రంప్.
Also Read : ప్రభుత్వాన్ని కూల్చేందుకు ట్రంప్ కుట్ర