UK PM Race : ప్రచారం ముగిసింది ఫలితమే మిగిలింది
రిషి సునక్ వర్సెస్ లిజ్ ట్రస్
UK PM Race : ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ఉత్కంఠ రేపుతున్న యుకె ప్రధాన మంత్రి రేసులో (UK PM Race) భారతీయ సంతతికి చెందిన రిషి సునక్ , విదేశాంగ శాఖ మంత్రి లిజ్ ట్రస్ నిలిచారు.
సెప్టెంబర్ 4తో పీఎం ఎన్నికల ప్రచారం ముగిసింది. సోమవారం ఇంత వరకు ఉత్కంఠ రేపుతూ వచ్చిన ఎన్నికల ప్రచారం ముగిసింది.
ఇప్పటి వరకు నాలుగు రౌండ్ల ఎన్నికలు ముగిశాయి.
ఈ నాలుగింట్లోనూ రిషి సునక్ ఆధిక్యాన్ని వహిస్తూ వచ్చారు. కానీ ఆ తర్వాత జరిగిన ఓపినీయన్ పోల్స్ లో మాత్రం ఊహించని రీతిలో వెనక్కి నెట్టి వేయబడ్డారు.
కన్జర్వేటివ్ పార్టీలో ప్రస్తుతం లిజ్ ట్రస్ కు జనాదరణ పెరుగుతోంది. ఇదిలా ఉండగా ఇవాళ బ్రిటీష్ ప్రధానమంత్రి పదవికి పోటీ చేసిన తొలి భారతీయ సంతతికి చెందిన పార్లమెంట్ సభ్యుడిగా చరిత్ర సృష్టించారచు రిషి సునక్. తన రెడీ ఫర్ రిషి ప్రచారానికి తన బృందానికి ధన్యవాదాలు అంటూ నోట్ లో సంతకం చేశారు.
బోరిస్ జాన్సన్ స్థానంలో నాయకత్వ ఎన్నికల్లో ఓటు వేసిన కన్జర్వేటివ్ పార్టీ సభ్యులపై చాలా సర్వేలు, యుకె మీడియా నివేదికలు లిజ్ ట్రస్ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటూ స్పష్టం చేశాయి.
ఇంత కాలం పాటు చేస్తూ వచ్చిన ప్రచారానికి నేటితో తెర పడింది. ఈ సందర్భంగా రిషి సునక్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఓటింగ్ ముగిసింది.
నా సహ ఉద్యోగులందరికీ , ప్రచార బృందానికి , నాకు మద్దతు ఇచ్చినందుకు వచ్చిన వారందరికీ ధన్యవాదాలు..సోమవారం కలుద్దామంటూ స్పష్టం చేశారు.
Also Read : నెట్టింట్లో ఉక్రెయిన్ చీఫ్ సెన్సేషన్