P Chidambaram : బీజేపీది తుక్డే తుక్డే గ్యాంగ్ – చిదంబరం
మాజీ కేంద్ర మంత్రి షాకింగ్ కామెంట్స్
P Chidambaram : మాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పి. చిదంబరం(P Chidambaram) షాకింగ్ కామెంట్స్ చేశారు. బిల్కిస్ బానో అత్యాచారం కేసులో దోషులను విడుదల చేయడంపై తీవ్రంగా తప్పు పట్టారు.
ఈ సందర్భంగా బీజేపీ నాయకులను తుక్డే తుక్డే గ్యాంగ్ అంటూ నిప్పులు చెరిగారు. మధ్య ప్రదేశ్ రాష్ట్ర హోం శాఖ మంత్రి నరోత్తమ్ మిశ్రా చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు చిదంబరం.
ఈ సందర్భంగా సదరు హోం మంత్రి కేంద్ర హోం శాఖ మంత్రిగా అమిత్ షా బదులు పని చేస్తే బాగుంటుందన్నారు. బిల్కిస్ బానోకు(Bilkis Bano) మద్దతుగా నిలిచిన ప్రముఖ నటి షబానా ఆజ్మీ, రచయిత జావేద్ అక్తర్ , నటుడు నసీరుద్దీన్ షా తుక్డే తుక్డే గ్యాంగ్ కు చెందిన స్లీపర్ సెల్ అని నరోత్తమ్ మిశ్రా చేసిన వ్యాఖ్యలు దురదృష్టకరమన్నారు.
ఇంత మందిని చేర్చిన హొం మంత్రి తనను కూడా ఎందుకు చేర్చలేదంటూ ప్రశ్నించారు చిదంబరం. ఇప్పటికే తాను పార్లమెంట్ లో ప్రకటించానని తెలిపారు.
ఈ సందర్భంగా షబానా ఆజ్మీ ఓ జాతీయ మీడియాతో మాట్లాడారు. ఒక మహిళ పట్ల ఇంత నిర్దాక్షిణ్యంగా ప్రవర్తిస్తారని, వ్యవహరిస్తారని తాను కలలో కూడా అనుకోలేదన్నారు.
బిల్కిస్ బానోకు తాము బేషరత్తుగా మద్దతు ఇస్తామన్నారు. ఈరోజు వరకు ఆమె ఒంటరిగా పోరాటం చేస్తూ వచ్చిందని ఇందుకు ఆమెను అభినందించి తీరాల్సిందేనని పేర్కొన్నారు.
విచిత్రం ఏమిటంటే కేంద్ర హొం శాఖ మంత్రి కంటే మధ్య ప్రదేశ్ మంత్రి వద్దనే ఎక్కువ సమాచారం ఉన్నట్టు అనిపిస్తోందన్నారు.
Also Read : పని తీరు ఆధారంగానే సీట్లు కేటాయింపు
I had also pointed out that in the answer to a question, the MHA said that the government had "no information" on the tukde-tukde gang!
If the Home Minister of MP has more information than the Union Home Minister, he should be appointed as the Union Home Minister!
— P. Chidambaram (@PChidambaram_IN) September 4, 2022