Rahul Gandhi Modi : మోదీ నిర్వాకం ధరాభారం – రాహుల్
కొనేముందు ప్రజలు ఆలోచించాలి
Rahul Gandhi Modi : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై మరోసారి నిప్పులు చెరిగారు కాంగ్రెస్ పార్టీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ. మోదీ నిర్వాకం కారణంగా ఇవాళ దేశంలో నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని(Rahul Gandhi Modi) ఆరోపించారు.
హల్లా బోల్ ర్యాలీకి శ్రీకారం చుట్టింది కాంగ్రెస్ పార్టీ. దేశం అధోగతిపాలు కావడానికి ప్రధాన కారణం మోదీనేనంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాచరిక పాలన సాగిస్తున్న రాజుగా వ్యవహరిస్తున్న, తనకు తానుగా భావించుకుంటున్న మోదీ మరోసారి తానేం చేస్తున్నారో ఆలోచించు కోవాలని సూచించారు.
ఓ వైపు ద్రవ్యోల్బణం ఇంకో వైపు నిరుద్యోగం రేటు పెరుగుతోందన్నారు. కానీ ఇప్పటి వరకు ఏడాదికి 2 కోట్ల జాబ్స్ కాదు కదా ఒక్క పోస్టు కూడా భర్తీ చేసిన పాపాన పోలేదన్నారు రాహుల్ గాంధీ(Rahul Gandhi).
నిత్యావసర వస్తువులను కొనుగోలు చేసే ముందు 10 సార్లు ఆలోచించాల్సిన పరిస్థితికి తీసుకు వచ్చిన ఘనత మోదీకే దక్కుతుందన్నారు. ఢిల్లీ లోని రాంలీలా మైదానంలో కాంగ్రెస్ పార్టీ హల్లా బోల్ ర్యాలీ చేపట్టనుంది.
సందర్భంగా రాహుల్ గాంధీ చేసిన ట్వీట్ కలకలం రేపుతోంది. మోదీ(PM Modi) తన స్నేహితులైన వ్యాపారస్తులకు మేలు చేకూర్చేందుకే ప్రయత్నం చేస్తున్నారంటూ ఆరోపించారు.
ద్రవ్యోల్బణానికి వ్యతిరేకంగా తనతో పాటు మిగతా పార్టీలు సైతం గొంతులు పెంచుతూనే ఉంటాయన్నారు. ఇదిలా ఉండగా సెప్టెంబర్ 7న రాహుల్ గాంధీ ప్రారంభించనున్న కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు 3,500 కిలోమీటర్ల మేర సాగే కాంగ్రెస్ భారత్ జోడో యాత్రకు హల్లా బోల్ ర్యాలీ నాంది కానుంది.
ప్రస్తుతం రాహుల్ గాంధీ ఆగస్టు చివరి వారం నుంచి తన చెల్లెలు, తల్లితో పాటే ఇటలీలో ఉన్నారు.
Also Read : బీజేపీది తుక్డే తుక్డే గ్యాంగ్ – చిదంబరం