CM Bhupesh Baghel : వ్యాపారవేత్తల కోసమే మోదీ ఉన్నది
ఛత్తీస్ గఢ్ సీఎం భూపేష్ భగెల్
CM Bhupesh Baghel : ఛత్తీస్ గఢ్ సీఎం భూపేష్ భగేల్ జిగేల్ మనిపించేలా నిప్పులు చెరిగారు దేశ ప్రధాని నరేంద్ర మోదీపై. తాము రైతులను రుణాలు మాఫీ చేయాలని అడిగాం.
ఇదే సమయంలో రాష్ట్రంలో రైతులకు మేలు చేకూర్చేలా నిర్ణయం తీసుకున్నాం. కానీ రైతుల ప్రయోజనాల కంటే వ్యాపారవేత్తల ప్రయోజనాలకే ప్రయారిటీ ఇస్తూ వచ్చారు.
అందుకే దోపిడీ దొంగలకు ఏకంగా రూ. 10 లక్షల కోట్ల రుణాలను మాఫీ చేశారు. భారత దేశ చరిత్రలో ఏ ప్రధాని ఇలాంటి చెత్త నిర్ణయం తీసుకోలేదన్నారు.
మాటలు తప్ప చేతలు లేవన్నారు. ప్రచార ఆర్భాటం తప్ప ఆచారణాత్మక నిర్ణయాలు ఇప్పటి వరకు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు.
వ్యవస్థలను నిర్వీర్యం చేస్తూ ప్రభుత్వ సంస్థలను గంప గుత్తగా అమ్మకానికి పెడుతూ దేశాన్ని దివాలా తీసే స్థాయికి తీసుకు వెళ్లిన ఘనత మాత్రం మోదీకే దక్కుతుందన్నారు.
ఈ ఎనిమిదేళ్ల కాలంలో కేంద్ర సర్కార్ సాధించిన ప్రగతికి ఇది నిదర్శనమన్నారు సీఎం భగేల్(CM Bhupesh Baghel). ఎవరి ప్రయోజనాలను తాకట్టు పెట్టారో ప్రజలకు తెలుసన్నారు.
ఎవరైనా నష్టాల్లో ఉన్న సంస్థలను అమ్మకానికి పెడతారు కానీ మోదీ సర్కార్ మాత్రం లాభాలలో ఉన్న సంస్థలను కార్పొరేట్లకు అప్పజెప్పే పనిలో ఉన్నారంటూ మండిపడ్డారు.
దేశంలో ప్రజాస్వామ్య ప్రభుత్వం అనేది ఉందా అన్నఅనుమానం కలుగుతోందని ఒక రకంగా చెప్పాలంటే ఇది బీజేపీ సర్కార్ కాదని ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అంటూ ఎద్దేవా చేశారు.
ఇప్పటి వరకు ఎనిమిదేళ్ల కాలంలో ఎనిమిది రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చి వేశారని ఇదొక్కటే ఆయన సాధించిన ఘనత అని పేర్కొన్నారు.
Also Read : మోదీ నిర్వాకం ధరాభారం – రాహుల్